థ్రిల్లర్ జోనర్లో నాని నెక్స్ట్ సినిమా ?

Tuesday, April 17th, 2018, 02:28:21 PM IST

నాచురల్ స్టార్ నాని హీరోగా నటించిన కృష్ణార్జున యుద్ధం సినిమా ఆశించిహిన స్థాయిలో బాక్స్ ఆఫీస్ వద్ద ఫలితాన్ని రాబట్టలేక పోయింది. డివైన్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమాలో నాని డ్యూయల్ రోజే చేసిన విషయం తెలిసిందే. ఈ సినిమా తరువాత నాని – నాగార్జున తో కలిసి చేస్తున్న మల్టి స్టారర్ లో నటిస్తున్నాడు. ఈ సినిమాలతో పాటు .. పలువురు దర్శకులు నానితో సినిమాలు చేయడానికి రెడీ అయ్యారు. ఈ లిస్ట్ లో కిషోర్ తిరుమల, హను రాఘవపూడి, అవసరాల శ్రీనివాస్ లాంటి దర్శకులతో పాటు తాజాగా విక్రమ్ కుమార్ కూడా లైన్ లోకి వచ్చాడు. ఈ మద్యే వీరిద్దరి మధ్య కథ చర్చలు జరిగాయని, కథ నచ్చడంతో నాని ఓకే చెప్పినట్టు తెలిసింది. అయితే ఈ సారి వీరిద్దరి కాంబినేషన్ లో హారర్, థ్రిల్లర్ జోనర్ లో సినిమా ఉంటుందట. నాని మొదటి సారి థ్రిల్లర్ సినిమాలో నటిస్తుండడం విశేషం. త్వరలోనే దీనికి సంబందించిన వివరాలు వెల్లడి కానున్నాయి.