థ్రిల్లర్ కథలో నాని.. ఆ సినిమాలకంటే ముందే వస్తుందట?

Monday, April 16th, 2018, 06:25:54 PM IST

టాలీవుడ్ లో ప్రస్తుతం వరుస విజయాలతో దూసుకుపోతోన్న నాని చాలా స్పీడ్ గా కథలను ఒకే చేస్తున్నాడు. రీసెంట్ గా మేర్లపాక గాంధీ దర్శకత్వంలో కృష్ణార్జున యుద్ధం సినిమా వచ్చిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం సినిమా మిక్సిడ్ టాక్ తో నడుస్తోంది. ఇకపోతే మరికొన్ని సినిమాలను కూడా నాని త్వరత్వరగా పూర్తి చేయాలనీ అనుకుంటున్నాడు. ప్రస్తుతం నాని నలుగురి దర్శకులకు కమిట్ అయ్యి ఉన్నాడు. ముందుగా నాగ్ తో మల్టి స్టారర్ ఒప్పుకున్నా సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆ సినిమా సెట్స్ పై ఉంది.

ఇక నానికి సన్నిహితుడైన శ్రీనివాస్ అవసరాల దర్శకత్వంలో కూడా ఒక సినిమా రానుంది. అలాగే కిషోర్ తిరుమల – హను రాఘవాపుడి దర్శకత్వంలో కూడా నాని సినిమా చేయనున్నాడు. అయితే వీటికంటే ముందే విలక్షణ దర్శకుడైన విక్రమ్ కె కుమార్ దర్శకత్వలో నాని సినిమా చేయనున్నట్లు తెలుస్తోంది. సప్సెన్స్ థ్రిల్లర్ తరహాలో ఆ సినిమా ఉండనుందట. 13బి – మనం – 24 సినిమాలతో విక్రమ్ దర్శకుడిగా తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇక చివరగా అఖిల్ తో హలో సినిమా చేశాడు. ఆ సినిమా అనుకున్నంత స్థాయిలో హిట్ అవ్వలేదు. దీంతో ఈ సారి ఎలాగైనా మంచి హిట్ అందుకోవాలని తన థ్రిల్లర్ ఫార్మాట్ ని విక్రమ్ ఉపయోగించనున్నాడట. మరి ఆ ప్లాన్స్ ఎంతవరకు వర్కౌట్ అవుతాయో చూడాలి.

  •  
  •  
  •  
  •  

Comments