అబ్బో .. నాని భలే టైటిల్ పట్టాడుగా ?

Friday, October 20th, 2017, 11:00:33 AM IST

ఈ మధ్య నాని జోరు ఎక్కడ తగ్గడం లేదు. ఇప్పటికే రెండు హ్యాట్రిక్ విజయాలను అందుకున్న నాని తాజాగా ఎదో హిట్టుకోసం సిద్దమయ్యాడు. ప్రస్తుతం ఎం సి ఏ సినిమాలో నటిస్తున్న నాని మరో వైపు కృష్ణార్జున యుద్ధం సినిమా కూడా చేస్తున్నాడు. మేర్లపాక గాంధీ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా ఓ షెడ్యూల్ ని పూర్తీ చేసుకుంది. తాజాగా నాని మరో దర్శకుడితో సినిమాకు ఓకే చెప్పాడు. ఆ దర్శకుడు ఎవరో కాదు నేను శైలజ సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న కిషోర్ తిరుమల. ప్రస్తుతం రామ్ తో ఉన్నది ఒకటే జిందగీ సినిమా చేస్తున్న కిషోర్ ఇప్పటికే నానికి కథ చెప్పి ఓకే చేయించాడు. అన్నట్టు ఈ సినిమాకు కూడా టైటిల్ ఫిక్స్ చేశారట !! టైటిల్ ఏమిటో తెలుసా చిత్రలహరి? ఈ పేరు 80, 90 వ దశకంలో పుట్టి పెరిగిన ప్రతి ఒక్కరికి బాగా పరిచయం. అప్పట్లో దూరదర్శన్ లో ప్రతి శుక్రవారం చిత్రలహరి పేరుతొ పాటల కార్యక్రమం వచ్చేది .. అలాగే హిందీలో చిత్రహార్ గా బుధవారం ప్రసారం అయ్యేది. అందరికి ఆకట్టుకునేందుకు కిషోర్ ఈ టైటిల్ ప్లాన్ చేసి ఉంటాడు. సో ఈ సినిమా డిసెంబర్ లో సెట్స్ పైకి వచ్చే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది.

  •  
  •  
  •  
  •  

Comments