ఆ హీరోలకే నాని కౌంటర్ వేశాడా ?

Tuesday, January 31st, 2017, 10:32:29 AM IST

Naniనాకు ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకపోవడం చాలా మంచిదైంది .. ఓక రకంగా అది అదృష్టంగా కూడా, ఎందుకంటే ఎవరైనా నేను మీ అభిమానిని అని చెప్పినపుడు .. ఆ మాట చాలా సంతోషంగా అనిపిస్తుంది .. హమ్మయ్య ఇతడు ఖచ్చితంగా నా అభిమానే అంటూ కామెంట్ చేసాడు ? అంటే ఈ కౌంటర్ ఖచ్చితంగా వారసత్వ హీరోలకే అని అర్థం అవుతుంది? నాని హీరోగా లేటెస్ట్ గా నటిస్తున్న నేను లోకల్ సినిమా ఫిబ్రవరి 3 న విడుదల అవుతుంది. త్రినాధ్ రావు నక్కిన దర్శకత్వంలో దిల్ రాజు నిర్మించిన ఈ సినిమా ప్రమోషన్ లో భాగంగా నాని మీడియా తో మాట్లాడాడు .. ఈ సందర్బంగా ఈ కామెంట్స్ చేసాడు నాని. బ్యాక్ గ్రౌండ్ ఉన్న హీరోలు కనిపిస్తే చాలు సర్ మేము మీ అభిమానులం అంటూ చెప్పే ఫాన్స్ .. నిజంగా వారు ఆ హీరో అభిమానులా లేక వాళ్ళ తండ్రులు, తాతల హీరోల అనే కన్ఫ్యూజన్ ఉంటుంది కానీ తనకు ఆ డౌట్ లేదనే చెప్పకనే చెప్పాడు నాని ?