మొదటి సారి పోలీస్ పాత్రలో .. నాని ?

Saturday, September 8th, 2018, 06:39:55 PM IST

యంగ్ హీరో నాని వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. ఆవు సినిమాలే కాదు వరుస విజయాలు అందుకుంటు క్రేజ్ తెచ్చుకుంటున్నాడు. ఇప్పటికే నాని చేతిలో అరడజనుకు పైగా సినిమాలు ఉన్నాయి. ప్రస్తుతం నాగ్ తో కలిసి దేవదాస్ అనే మల్టీ స్టారర్ సినిమా చేస్తున్న నాని మరో వైపు జెర్సీ, అనే స్పోర్ట్ కథతో సినిమాకు చేస్తున్నాడు. దాంతో పాటు మళ్ళిరావా ఫేమ్ గౌతమ్ తిన్నసూరి దర్శకత్వంలో మరో సినిమాకు ఓకే చెప్పాడు. దాంతో పాటు చంద్ర శేఖర్ యేలేటి దర్శకత్వంలో మరో సినిమాకు ఓకే చెప్పాడు. అయితే ఈ సినిమాలో నాని పోలీస్ అధికారిగా కనిపిస్తాడట. నాని కెరీర్ లో మొదటి సారి పోలీస్ గా నటిస్తున్నాడు. యేలేటి సినిమాలు సహజత్వానికి దగ్గరగా ఉంటాయి .. మరి ఈ కథ ఎలా ఉంటుందో చూడాలి. ప్రస్తుతం భిన్నమైన సినిమాలను ఎంచుకుంటూ ముందుకు సాగుతున్న నాని పోలీస్ గా ఎలా ఆదరగొడతారో చూడాలి. ఈ సినిమా వచ్చే ఏడాది పట్టాలు ఎక్కే అవకాశం ఉంది.

  •  
  •  
  •  
  •  

Comments