త్రివిక్రమ్ – నాని..సెట్ అయినట్టే?

Friday, June 8th, 2018, 11:22:37 AM IST

టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ తో ఒక సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవల అరవింద సమేత అనే టైటిల్ ను కూడా చిత్ర యూనిట్ ఫైనల్ చేసి అభిమానులను ఆకట్టుకుంది. అలాగే ఎన్టీఆర్ ఫస్ట్ లుక్ కూడా అందరికి తెగ నెచ్చెసింది. ఈ సినిమా షూటింగ్ మరికొన్ని రోజుల్లో ముగుస్తుంది. ఇక ఆ తరువాత త్రివిక్రమ్ వెంకటేష్ తో చేస్తాడని గతంలోనే వార్తలు వచ్చాయి.

వెంకీ పుట్టిన రోజు సందర్బంగా పోస్టర్స్ ని కూడా రిలీజ్ చేసి హంగామా చేశారు. ఇక ఇప్పుడు మరో హీరోతో మాటల మాంత్రికుడు సినిమా ఒప్పుకున్నట్లు తెలుస్తోంది. న్యాచురల్ స్టార్ నాని హీరోగా ఒక మంచి కామెడీ స్క్రిప్ట్ ను త్రివిక్రమ్ ఒకే చేయించుకున్నాడట. దాదాపు ఆ ప్రాజెక్ట్ ఫిక్స్ అని తెలుస్తోంది. నాని కూడా డేట్స్ రెడీ చేసుకుంటున్నట్లు సమాచారం. అయితే ఇప్పుడు త్రివిక్రమ్ వెంకీతో చేస్తాడా లేక నానితో చేస్తాడా అనేది సస్పెన్స్ గా మారింది. అరవింద సమేత షూటింగ్ ఎండింగ్ లోపు త్రివిక్రమ్ నెక్స్ట్ ప్రాజెక్ట్ పై ఓ క్లారిటీ వచ్చే అవకాశం ఉన్నట్లు టాక్.