‘శ్రీ‌మంతుడు’ సీన్ పైర‌సీలో లీక్‌

Friday, September 21st, 2018, 05:54:13 PM IST

సుధీర్ బాబు- న‌భా న‌టేష్ జంట‌గా ఆర్‌.ఎస్‌.నాయుడు ద‌ర్శ‌క‌త్వంలో సుధీర్ బాబు నిర్మించిన `న‌న్ను దోచుకుందువ‌టే` నేడు థియేట‌ర్ల‌లోకి రిలీజైన సంగ‌తి తెలిసిందే. చ‌క్క‌ని రొమాంటిక్ కామెడీ అన్న ప్ర‌శంస ద‌క్కింది. అయితే ఈ సినిమా నేడు ఇలా థియేట‌ర్‌లో రిలీజైందో లేదో అందులోంచి ఓ కీ సీన్‌ని ఎవ‌రో వీరాభిమాని మొబైల్‌లోకి పైర‌సీ చేసి ఆన్‌లైన్‌లో వ‌దిలేశాడు. ప్ర‌స్తుం ఆ సీన్ యువ‌త‌రం వాట్సాప్‌లు, సామాజిక మాధ్య‌మాల్లో జోరుగా వైర‌ల్ అయిపోతోంది. ఆ సీన్ వ‌స్తున్నంత‌సేపూ జ‌నం విజిల్స్‌, క్లాప్స్‌తో హోరెత్తించేశారు. ఇంత‌కీ ఆ సీన్ ఏంటి? అంటే..

శ్రీ‌మంతుడు చిత్రంలో మ‌హేష్ – శ్రుతిహాస‌న్ మ‌ధ్య రొమాంటిక్ సీన్ అది. శ్రుతి త‌న ఇంటి ఆరుబ‌య‌ట ముగ్గు వేస్తుంటుంది. ఆ టైమ్‌లో అటువైపుగా వెళుతున్న మ‌హేష్ కార్‌లోంచి త‌న‌నే చూస్తుంటాడు. అలా ఆ ఇంటి చుట్టూ మూడు నాలుగు రౌండ్లు కొడ‌తాడు. ఆ రొమాంటిక్ సీన్ అద్భుతంగా పండింది. సేమ్ సీన్‌కి ప్యార‌డీగా న‌న్ను దోచుకుందువ‌టే చిత్రంలో సుధీర్ బాబు న‌టించాడు. ఆరుబ‌య‌ట ముగ్గులేస్తున్న న‌భాన‌టేష్‌ని లైనేసే కుర్రాడిగా సుధీర్ అద్భుత‌మైన ఎక్స్‌ప్రెష‌న్స్ ఇచ్చాడు. అస‌లింత‌కీ మా అబ్బాయిని ఎక్క‌డ క‌లిశావ్‌? అని హీరో డాడ్ ప్ర‌శ్నిస్తే అప్పుడు చెబుతుంది న‌భా ఈ స్టోరి. మొత్తానికి సీన్ బాగానే పేలింది కానీ, ఇలా పైర‌సీలో లీకైపోవ‌డం ఏంటో?