సూర్య పాటల హంగామా తిరుపతిలోనేనా ?

Tuesday, April 3rd, 2018, 10:13:01 AM IST

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా వక్కంతం వంశీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా ఒక్క పాట మినహా చిత్రీకరణ పూర్తీ చేసుకుంది. ఈ చిత్రంలో మిలటరీ అధికారిగా కనిపిస్తున్నాడు అల్లు అర్జున్. ఇక ఈ సినిమా ఎప్పుడెప్పుడు చూడాలి అనే ఆసక్తి ఎక్కువైంది. ఎందుకంటే అల్లు అర్జున్ సరికొత్త పాత్రలో కనిపించడమే ఇందుకు కారణం. ఇప్పటికే విడుదలైన టీజర్ ఓ రేంజ్ లో సంచలనం రేపింది. మే 4 న ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో విడుదలకు ప్లాన్ చేస్తున్నాడు నిర్మాత లగడపాటి శ్రీధర్.

ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకను ఈ నెల 15 న జరపడానికి సన్నాహాలు చేస్తున్నారట. అయితే ఈ వేడుక ఎక్కడ జరపాలనే విషయంలో ఆలోచనలో పడ్డట్టు తెలుస్తోంది. ఇప్పటీకే అటు కర్నూల్ లో లేదా తిరుపతిలో చేయాలనీ ప్లాన్ చేసారని .. ఫైనల్ గా తిరుపతిలో జరిగే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. వైజాగ్, హైద్రాబాద్, విజయవాడ లలో చేయడం రొటీన్ అవుతుందని భావించిన యూనిట్ ఈ ప్లాన్ చేసిందట. అను ఇమ్మానుయేల్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో శరత్ కుమార్ కీలక పాత్ర పోషిస్తున్నాడు.