రాజకీయాలలోకి నేనా ? నో వే – బాలకృష్ణ కూతురు !

Sunday, February 12th, 2017, 12:44:15 PM IST


ఆమె తెల్లారితే ఆమె చుట్టూరా ఉండేది మొత్తం రాజకీయ వాతావరణం. తెలుగు వారికి రాజకేయాలు నేర్పించిన నేత నందమూరి తారక రామారావు మనవరాలు ఆమె, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కోడలు , ఒక ఎమ్మెల్యే కూతురు. అయినా కూడా ఆమెకి రాజకీయాలు అంటే ఇష్టం లేదట. హెరిటేజ్ సంస్థ డైరెక్టర్ గా పని చేస్తున్న ఆమె పార్లమెంటరీ సదస్సు కి హాజరు అయ్యి ప్రసంగించారు. నాలుగు గంటల పాటు వేదిక మీద పలువురితో ముచ్చటించిన ఆమె తనకి స్ఫూర్తి దాతలు చాలామందే ఉన్నారు అని చెప్పుకొచ్చారు. ఏపీ సర్కారు ఏర్పాటు చేసిన సదస్సులు మహిళలకి ఎంతగానో ఉపయోగ పడతాయి అనీ మహిళా సాధికారత సాధించడం కోసం తోడ్పాటు అందిస్తాయి అన్నారు బ్రాహ్మణి. అయితే రాజకీయాల విషయం లో ఆమె కాస్త వింతగా సమాధానం చెప్పారు. రాజకీయాల్లోకి రానని.. తనకు అలాంటి ఆలోచన లేదని చెప్పిన బ్రాహ్మణి.. రాజకీయ అంశాలపై మాట్లాడేందుకు ఏ మాత్రం ఇంట్రస్ట్ చూపించకపోవటం గమనార్హం. ఏ మాత్రం అవకాశం ఉన్నా.. రాజకీయాల్లోకి వచ్చేసి.. అధికారాన్ని చేజిక్కించుకోవటంపై ఆసక్తి ప్రదర్శించే వారికి భిన్నంగా బ్రహ్మాణి తీరు ఉంది