మాజీ ఎమ్మెల్యే సత్యప్రభ గారి మృతి విచారకరం – నారా లోకేష్

Friday, November 20th, 2020, 11:11:36 AM IST

తెలుగు దేశం పార్టీ కీలక నేత, మాజీ ఎమ్మెల్యే డీకే సత్యప్రభ మృతి పట్ల తెలుగు దేశం పార్టీ నేతలు విచారం వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు తెలుగు దేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఆమె మృతి పట్ల పలు కీలక వ్యాఖ్యలు చేశారు. టీడీపీ జాతీయ ఉపాధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్యే డీకే సత్యప్రభ గారి మృతి విచారకరం అని నారా లోకేష్ అన్నారు. చిత్తూరు ఎమ్మెల్యే గా ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఎంతగానో కృషి చేసి, తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపించారు అని నారా లోకేష్ కొనియాడారు.

శ్రీనివాస్ ట్రస్ట్ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించి ఎంతోమందికి అండగా నిలిచారు అని నారా లోకేష్ పేర్కొన్నారు. విద్యా సంస్థలు, పరిశ్రమల ద్వారా ఎంతోమందికి ఉపాధి కల్పించిన శత్యప్రభ గారి మృతి తీరని లోటు అని అన్నారు. వారి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్ధిస్తూ, వారి కుటుంబ సభ్యులకి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు నారా లోకేష్.