రాజన్న రాజ్యం ఇదేనా జగన్ గారు?

Sunday, July 14th, 2019, 05:40:38 PM IST

గత కొన్నాళ్ల నుంచి టీడీపీ మాజీ మంత్రి చంద్రబాబు తనయుడు నారా లోకేష్ తన ట్విట్టర్ ఖాతా ద్వారా వైసీపీ మరియు ఆ పార్టీ అధినేత వై ఎస్ జగన్ ను టార్గెట్ చేస్తున్న సంగతి అందరికి తెలిసిందే.అయితే వైసీపీ అధికారంలోకి వచ్చాక మాత్రం లోకేష్ విమర్శల దాడి మరింత ఎక్కువయ్యిందనే చెప్పాలి.అందులో భాగంగా గత కొన్ని రోజులు నుంచి వైసీపీకి చెందిన నేతలు కానీ కార్యకర్తలు కానీ ఎక్కడ ఏ తప్పు చేసినా సరే తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా మాటల దాడి చేస్తున్నారు.

తాజాగా ఓ మహిళ మీద వైసీపీ మినిస్టర్ చేయించిన దాడిని ఖండిస్తూ ఒక ట్వీట్ పెట్టారు.”వైకాపా మంత్రి పేర్ని నాని వేధింపులకు జయలక్ష్మిగారు ఆత్మహత్యాయత్నం చేసారు. ఒక మహిళ హోమ్ మంత్రిగా ఉన్న ఈ ప్రభుత్వంలో మహిళలకు భద్రత లేదు. మంత్రే వేధింపులకు పాల్పడితే వైసీపీ మూకలు ఇంకెంతమందిని బలి తీసుకుంటారో ? ఇదేనా రాజన్న రాజ్యం వై ఎస్ జగన్ గారు ?” అని ట్వీట్ చేసారు.మరి దీనిపై జగన్ కానీ లేదా విజయసాయి రెడ్డి కానీ ఎలాంటి రిప్లై ఇస్తారో చూడాలి.