జగన్ చెప్పిన రైతు దినోత్సవంపై లోకేష్ సెన్సషనల్ ట్వీట్.!

Thursday, July 11th, 2019, 12:22:20 PM IST

మొన్న జూలై 8 వా తారీఖును ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ రైతుల దినోత్సవంగా ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే.అయితే జగన్ ఇచ్చిన ఈ స్టేట్మెంట్ పై వైసీపీ శ్రేణులు ఆనందం వ్యక్తం చేసినా ఇతర పార్టీల వారు మాత్రం పెద్ద ఎత్తున విమర్శలు చేస్తూనే వచ్చారు.ఇంకా రాష్ట్రంలో రైతుల సమస్యలు తీరనే లేదు అప్పుడే జగన్ ఏమో ఇలాంటి ప్రకటనలు ఇస్తున్నారని కొందరు రైతుల దినోత్సవం డిసెంబర్ 23 న అయితే జగన్ ఇలా చెప్పడం వల్ల ఏవైనా పరీక్షలకు ప్రిపేర్ అయ్యే వాళ్లు తప్పుడు సమాదానాలు పెట్టే అవకాశాలు ఉంటాయని మరికొందరు అంటున్నారు.

ఇదిలా ఉండగా గత కొన్నాళ్ల నుంచి టీడీపీ మాజీ మంత్రి మరియు చంద్రబాబు తనయుడు నారా లోకేష్ వైసీపీను మరియు ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ ను టార్గెట్ చేసే విధంగా ట్వీట్లు పెడుతున్నారు.ఇప్పుడు తాజాగా మరో సంచలన ట్వీట్ పెట్టారు.”పొలంలో నాట్లు వేసుకోవాల్సిన రైతు, విత్తనాల కోసం రోడ్డెక్కి సిగపట్లు పడుతున్నాడు. రైతు సమస్యలు తీర్చకుండానే… ప్రభుత్వం రైతు దినోత్సవం జరిపేసుకుంది.” అని ఒక వీడియోను సాక్ష్యంగా పెట్టి మరీ ట్వీట్ చేసారు.