బ్రేకింగ్: మొత్తానికి నారా లోకేశ్ రూటు మారుస్తున్నాడుగా..!

Saturday, June 1st, 2019, 11:59:07 AM IST

ఏపీలో ఈ దఫా జరిగిన ఎన్నికలలో వైసీపీ భారీ విజయాన్ని నమోదు చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే టీడీపీ మాత్రం ఘొర పరాభవాన్ని మూటగట్టుకుని అధికార పార్టీ నుంచి ప్రతిపక్ష పార్టీగా మారిపోయింది. అయితే పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు పార్టీనీ కాపాడుకెనే పనిలో ఉంటే ఆయన తనయుడు మాత్రం కొత్త దారులను వెతుకుంటున్నారు. అయితే మంగళగిరి నుంచి పోటీ చేసి ఓటమిపాలైన నారా లోకేశ్‌కి రాజకీయంగా ఇప్పుడు పెద్ద పనులేమి లేవు. అంతేకాదు పార్టీనీ ముందుండి నడిపించడానికి చంద్రబాబు ఉండగా, అవసరమైనప్పుడు మాత్రమే నారా లోకేశ్ రాజకీయపరమైనటువంటి పనులలో పాల్గొనాలని లోకేశ్ నిశ్చయించుకున్నారట.

ఇదిలా ఉండగా తాజాగా నారా లోకేశ్ బిజినెస్ చూసుకుంటాడని వార్తలు బలంగా వినిపిస్తున్నాయి. అయితే నార లోకేశ్ సినిమా రంగం వైపు వెళ్ళడానికి ఇష్టపడుతున్నారని సొంతంగా ఆయన మామ బాలకృష్ణ, తన సోదరుడు నారా రోహిత్ సినిమాలలో ఉండడం మరియు నందమూరి వారసులు కూడా ఇదే రంగంలోనే ఉన్నందున నారా లోకేశ్ కూడా ఇటువైపే అడుగులు వేస్తున్నారని సమాచారం. అయితే సినిమా రంగం అంటే ఆయన నటించడానికి అనుకుంటున్నారా కాదండోయి అలాంటి సాహసం మాత్రం లోకేశ్ చేయదలుచుకోలేదు. సినీ నిర్మాతగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ఈ ఐదేళ్ల పాటు బిజినెస్ చేయాలనే ఆలోచనతో ఉన్నాడట. ఎలాగో తమ కుటుంబ సభ్యులే హీరోలుగా ఉండడం తన బిజెనెస్‌కి ప్లస్ అవుతుందని అనుకుంటున్నారట. అయితే తమ పార్టీ అధికారంలోకి రాలేదు కాబట్టి నారా లోకేశ్ ఇలా కొత్త పుంతలకు కదం తొక్కుతున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే లోకేశ్ మాత్రం దీనిపై ఇంకా ఎలాంటి వివరణ ఇవ్వలేదు. సాధారణంగా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నాయకులు ఎవరైనా సరే బిజినెస్‌లు చేసుకుంటుంటారు. ఇప్పుడు లోకేష్ కూడా అదే చేస్తారా, లేక పార్టీనీ ముందుండి నడిపించేందుకు తండ్రికి మద్ధతుగా ఉంటాడ అనేది మాత్రం తెలియడంలేదు.