బ్రేకింగ్: “మిస్డ్ కాల్ ఇవ్వండి అమరావతికి మద్దతు తెలపండి” అంటున్న టీడీపీ!

Tuesday, January 14th, 2020, 08:30:07 PM IST

ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి తీసుకున్న మూడు రాజధానుల నిర్ణయం వలన అమరావతిలో,పరిసర ప్రాంతాల్లో ఆందోళనలు కొనసాగుతున్నాయి. అమరావతిని రాజధానిగా తరలిస్తున్నారంటూ రైతులు పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తున్నారు. అయితే ఈ నేపథ్యంలో అమరావతి సంక్షేమ సమితి ఒక వినూత్న పద్దతిని చేపట్టింది. అమరావతికి మద్దతు తెలిపేందుకు మిస్డ్ కాల్ ఇవ్వండి అంటూ ఒక నంబర్ ని సోషల్ మీడియా లో ఉంచింది.

ఈ విషయాన్నీ తెలుగు దేశం పార్టీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ సోషల్ మీడియా ద్వారా తెలియజేసారు. అంతేకాకుండా ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి తీరుని దారుణంగా దుయ్యబట్టారు. ముఖ్యమంత్రి వైయస్ జగన్ గారి తుగ్లక్ నిర్ణయాలకు వ్యతిరేకంగా జరుగుతున్న ఉద్యమం లో భాగస్వామ్యం అవ్వండి అంటూ నారా లోకేష్ అన్నారు. అమరావతిని కాపాడుకుందాం అని తెలిపారు. భావితరాలకు బంగారు భవిష్యత్ ఇవ్వడంతో పాటు, సర్వం త్యాగం చేసిన రైతులకు భరోసా ఇవ్వడానికి 8460708090నంబర్ కి మిస్డ్ కాల్ ఇచ్చి మద్దతు పలకండి అని పేర్కొన్నారు. నేను మిస్డ్ కాల్ ఇచ్చి జై అమరావతి ఉద్యమానికి మద్దతు పలికాను, మరి మీరు అని నారా లోకేష్ సోషల్ మీడియా ద్వారా ఈ విషయాన్నీ తెలియజేసారు.