జగన్ ని చూసి వరుణుడు బయపడ్డాడేమో… లోకేష్ సెటైర్లు

Friday, August 16th, 2019, 01:28:14 AM IST

ఆంధ్రప్రదేష్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పై మాజీ మంత్రి టీడీపీ జాతీయ కార్యదర్శి సెటైర్లు వేశారు. కాగా ఏపీలో జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి కూడా టీడీపీ నాయకుల మీద కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని, వైసీపీ ప్రభుత్వం చేసే తప్పులన్నింటిని ఎప్పటికప్పుడు ట్విట్టర్ వేదిక ద్వారా నారాలోకేష్ ప్రజలందరి ముందు పెడుతున్నారు. కాగా తాజాగా మరొకసారి నారా లోకేష్ జగన్ పై ట్విట్టర్ ద్వారా పలు రకాల విమర్శలు చేశారు.

“సాగునీరు రాక ఉత్తరాంధ్ర ఉసూరుమంటోంది. చినుకు రాలక రాయలసీమ రాళ్లసీమలా కనిపిస్తోంది. గుక్కెడు నీటి కోసం ప్రకాశం ప్రజలు రోడ్డెక్కుతున్నారు. తమ వల్లే వానొచ్చిందని, వరదొచ్చిందంటూ వైసీపీ నేతలు మా జగనన్న భగీరధుడు అంటూ బిల్డప్ ఇస్తున్నారు. ఇప్పటి వరకూ 3 జిల్లాల్లోనే సాధారణ, 10 జిల్లాల్లో లోటు వర్షపాతం నమోదైంది. చాలా ప్రాంతాలలో తాగేందుకు నీరివ్వమంటూ జనాలు ఆందోళనకు దిగుతున్నారు. మరి వరుణుడు ఏమయ్యాడు, జగన్ గారు ముఖ్యమంత్రి అయ్యారు అని తెలిసిపోయి పక్క రాష్ట్రాలకు వెళ్లిపోయాడా? వైసీపీ మేధావులు మాత్రమే సమాధానం చెప్పాలి” అని లోకేష్ వాఖ్యానించారు.