ప్రభుత్వ విధానాలపై వైసీపీ ఎమ్మెల్యేల అసంతృప్తి.. నారా లోకేశ్ కామెంట్స్..!

Tuesday, June 2nd, 2020, 02:31:16 AM IST


ఏపీలో వైసీపీ అధికారంలోకి వచ్చాక నూతన ఇసుక పాలసీనీ అందుబాటులోకి తేవడానికి పాత ఇసుక విధానాన్ని రద్దు చేసింది. దీంతో ఇసుక కొరత తీవ్రంగా ఏర్పడింది. అయితే తాజాగా ప్రభుత్వం తీసుకొచ్చిన ఇసుక విధానంపై పలువురు వైసీపీ ఎమ్మెల్యేలు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇసుక విధానాన్ని సవరించాలని మంత్రులకు విజ్ఞప్తి చేశారు. ‘

అయితే దీనిపై స్పందించిన టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి లోకేశ్ ఇసుక దొరక్కుండా చేసి అడ్డదారిలో రేట్లు పెంచి అమ్ముకుంటూ ప్రజలను ప్రభుత్వం కొల్లగొడుతుందని, స్వయంగా వైకాపా శాసనసభ్యుడే బొచ్చెడు ఇసుక కూడా గ్రామాల్లో ఇవ్వలేకపోతున్నాం అని గోడు వెళ్లగక్కారని దీనిని బట్టి చూస్తుంటే వైకాపా స్యాండ్ మాఫియా అరాచకాలు ఏ స్థాయిలో ఉన్నాయో అర్థం అవుతుందని అన్నారు. అంతేకాదు ఆంధ్రప్రదేశ్‌లో ఇసుక మాయం అవుతుంది. 70 మంది భవన నిర్మాణ కార్మికులను బలితీసుకున్న తరువాత కూడా జగన్ గారి ఇసుక దాహం తగ్గలేదు. వైకాపా స్యాండ్ మాఫియా యథేచ్ఛగా రెచ్చిపోతుందని కామెంట్స్ చేశారు.