పంతం నెగ్గించుకోవాలనే మొండితనంతో ప్రభుత్వం ఉంది – నారా లోకేశ్

Monday, June 7th, 2021, 09:37:05 PM IST

ఏపీ సర్కార్‌పై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ మరోసారి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. పది, ఇంటర్ పరీక్షల నిర్వహణకు బదులు రద్దు చేయడమే ఉత్తమమని ప్రజలు అభిప్రాయపడుతున్నప్పటికీ ప్రభుత్వం మాత్రం విద్యార్థుల ప్రాణాలను పణంగా పెట్టయినా సరే తన పంతం నెగ్గించుకోవాలనే మొండితనంతో ఉందని, ఇది విద్యార్థులపై మానసికంగా ఎంతో ఒత్తిడిని తీసుకువచ్చిన మాట నిజం అని అన్నారు.

ఈ నేపథ్యంలో “కరోనా సమయంలో పరీక్షల నిర్వహణ – విద్యార్థులపై మానసిక ఒత్తిడి” అనే అంశంపై తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ వైద్య మరియు మానసిక నిపుణులతో జూన్ 8, 2021 ఉదయం 11 గంటలకు ఆన్‌లైన్ సమావేశం నిర్వహిస్తున్నారు. ఈ సమావేశంలో పాల్గొనదలచిన వారు ID 84634769076 pass code 275067లను ఉపయోగించుకోగలరని ట్విట్టర్ ద్వారా విజ్ఞప్తి చేశారు.