జగన్ పాదయాత్ర చేసింది అందుకే.. తేల్చి చెప్పిన నారా లోకేశ్..!

Monday, November 11th, 2019, 09:58:48 PM IST

ఏపీలో ఈ సారి జరిగిన సార్వత్రిక ఎన్నికలలో వైసీపీ భారీ విజయాన్ని నమోదు చేసుకుని ఏపీ ముఖ్యమంత్రిగా వైసీపీ అధినేత జగన్ పదవి బాధ్యతలు కూడా చేపట్టారు. అయితే అధికార పార్టీ టీడీపీ మాత్రం గెలుపే లక్ష్యంగా పెట్టుకుని పని చేసినా ఈ ఎన్నికలలో మునుపెన్నడు లేని రీతిలో ఓటమి పాలైంది. అయినా కూడా వైసీపీ, టీడీపీ మద్గ్య రోజూ మాటల యుద్ధం పెరిగిపోతూ ఉంది.

అయితే గత కొద్ది రోజుల నుంచి టీడీపీ యువనేత నారాలోకేశ్ వైసీపీపై తీవ్ర విమర్శలు చేస్తున్నాడు. అయితే తాజాగా ఎన్నికల ముందు జగన్ చేసిన పాదయాత్రపై స్పందించిన లోకేశ్ మిషన్ క్విడ్ ప్రో కో మళ్ళీ ప్రారంభమయ్యిందని, జగన్ గారు యువకుడుగా ఉండి రోజుకి మూడు కిలోమీటర్లు మాత్రమే పాదయాత్ర చేస్తుంటే, అప్పుడే అనుమానం వచ్చిందని, ఇప్పుడు నా అనుమానం నిజమైందని అన్నారు. పాదయాత్రలో జగన్ గారు ప్రభుత్వ స్థలాల సర్వే పూర్తి చేసారని, విలువైన ప్రభుత్వ ఆస్తులు అప్పనంగా కొట్టేయడానికి జగన్ అండ్ క్విడ్ ప్రో కో కంపెనీ స్కెచ్ వేసిందని, వాలంటీర్ల పేరుతో ఒకవైపు సంవత్సరానికి రూ.4 వేల కోట్ల ప్రజాధనాన్ని దోపిడీ చేస్తూ, మరోవైపు పథకాల కోసం ప్రభుత్వ ఆస్తులు అమ్మేస్తాం అంటే ఊరుకునేది లేదని హెచ్చరించారు.