ప్రభుత్వంలో మార్పు వస్తేనే కరోనా కట్టడి సాధ్యం – నారా లోకేష్

Thursday, April 22nd, 2021, 05:08:22 PM IST


ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం పై మరొకసారి ఘాటు వ్యాఖ్యలు చేశారు తెలుగు దేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో పదో తరగతి మరియు ఇంటర్ విద్యార్థులు పరీక్షలకు హాజరై, వారితో పాటుగా వారి కుటుంబ సభ్యులు కూడా కరోనా వైరస్ మహమ్మారి భారిన పడితే రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బాధ్యత తీసుకుంటారా అంటూ సూటిగా ప్రశ్నించారు. నారా లోకేష్ రాష్ట్రంలోని విద్యార్థుల తో, తల్లిదండ్రుల తో మరియు విద్యావేత్తలతో నారా లోకేష్ ఆన్లైన్ ద్వారా సమావేశం నిర్వహించారు. అయితే ఈ పదవ తరగతి మరియు ఇంటర్ పరీక్షలు నిర్వహిస్తే దాదాపు 80 లక్షల మంది కరోనా వైరస్ భారిన పడే ప్రమాదం ఉంది అంటూ నారా లోకేష్ హెచ్చరికలు జారీ చేశారు.

అయితే ప్రభుత్వం మొండిగా పరీక్షలు నిర్వహించాలని చూస్తోంది అంటూ విమర్శించారు. అయితే ఈ వైఖరి తో విద్యార్థుల జీవితాలకే పరీక్ష పెడుతున్నారు అంటూ నారా లోకేష్ చెప్పుకొచ్చారు. ప్రస్తుతం పరిస్థితుల్లో దేశం లోని అనేక రాష్ట్రాల్లో పరీక్షలు వాయిదా వేస్తున్నాయి అని వ్యాఖ్యానించారు. ఆన్లైన్ క్లాసులకు హాజరై, వ్యక్తిగతం గా పరీక్షలకు వెళ్ళిన విద్యార్థులు కరోనా వైరస్ భారిన పడిన ఘటనలు అనేకం ఉన్నాయి అని వ్యాఖ్యానించారు. అయితే ప్రభుత్వం లో మార్పు వస్తేనే కరోనా వైరస్ కట్టడి సాధ్యం అంటూ నారా లోకేష్ స్పష్టం చేశారు. అయితే నారా లోకేష్ చేసిన వ్యాఖ్యలకు వైసీపీ నేతలు ఎలా స్పందిస్తారో చూడాలి.