ఆ కంపెనీలు తప్ప కొత్తగా వచ్చిన కంపెనీల్లేవు – నారా లోకేష్

Wednesday, June 9th, 2021, 02:51:46 PM IST


ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం పై తెలుగు దేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే పరిశ్రమల శాఖ మంత్రి గౌతమ్ రెడ్డి ను సంబోధిస్తూ, రెండేళ్ల మీ పాలన లో ఉన్న పరిశ్రమలను బెదిరించి వసూలు చేసిన జే ట్యాక్స్ 30 వేల కోట్ల రూపాయలనే, వచ్చిన పెట్టుబడులు అని చెప్పినట్టు ఉన్నారు అంటూ విమర్శించారు. అయితే 65 భారీ పరిశ్రమలు ఏర్పాటు అయ్యాయి అని సెలవిచ్చారు అంటూ చెప్పుకొచ్చారు. అయితే ప్రెసిడెంట్ మెడల్ విస్కీ, ఆంధ్రా స్టార్ బ్రాందీ కంపెనీలు తప్పించి కొత్తగా వచ్చిన కంపెనీ లు లేవు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

అయితే తెలుగు దేశం పార్టీ ఐదేళ్ల పాలనలో విదేశీ పెట్టుబడుల ఆకర్షణ లో దేశంలోనే ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం 3,4 వ స్థానాల్లో ఉంటే, రెండేళ్ల వైఎస్ జగన్ పాలనలో 13 వ స్థానం లో ఉందని పేర్కొన్నారు. అయితే చంద్రబాబు నాయుడు తీసుకొచ్చిన కియా యాజమాన్యాన్ని వైసీపీ ఎంపి లే వీధి రౌడీల కంటే ఘోరంగా బెదిరించడం చూశాక ఏ విదేశీ కంపెనీ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి వస్తుంది అంటూ సూటిగా ప్రశ్నించారు. అయితే జే ట్యాక్స్ చెల్లించని కంపనీ లపై పిసిబి ను ప్రయోగించి మూయించేస్తుంటే, ఇంకెవరు కొత్తగా పెట్టుబడి పెడతారు అంటూ చెప్పుకొచ్చారు.