జగన్ పార్లమెంట్‌కి రోబోలను పంపాడు.. నారా లోకేశ్ అల్టీమేట్ కామెంట్స్..!

Tuesday, April 6th, 2021, 12:19:53 AM IST


ఏపీ సీఎం జగన్‌పై, వైసీపీ ఎంపీలపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ అల్టీమేట్ కామెంట్స్ చేశారు. తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నికల ప్రచారంలో విస్తృతంగా పాల్గొంటున్న నారా లోకేశ్ టీడీపీ అభ్యర్థిని గెలిపించాలని ప్రజలను కోరుతున్నాడు. అయితే వైఎస్ జగన్ పార్లమెంట్ కి రోబోలను పంపాడని ఎద్దేవా చేశారు. మోదీ గారు కనపడితే కాళ్ల మీద పడటం, బీజేపీ ఏ బిల్లు తెచ్చినా కనీసం చూడకుండా ఎస్ చెప్పడం వాటి పని అని అన్నారు. అయితే ఆకాశంలో ఉన్న జగన్ రెడ్డిని భూమ్మీదకి తీసుకురావడానికి ఆ శ్రీవారు అవకాశం ఇచ్చారని, తిరుపతిలో టిడిపి అభ్యర్థి పనబాక లక్ష్మీ గారిని గెలిపించాలని ప్రజల్ని కోరానని ట్విట్టర్ ద్వారా తెలిపాడు.