జగన్ కు ఆ అలవాటు అధికారం లోకి వచ్చాక కూడా పోలేదు – నారా లోకేష్

Thursday, May 21st, 2020, 11:45:11 PM IST

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఇటీవల కరెంట్ బిల్లులు ఎక్కువగా వస్తున్నాయి అంటూ ప్రజలు ఆందోళన చెందుతున్నారు. అయితే ఈ నేపధ్యంలో తెలుగు దేశం పార్టీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ పలు సంచలన వ్యాఖ్యలు చేశారు. డబ్బు కోసం ప్రజలను పీల్చుకు తినే గత అలవాటు ముఖ్యమంత్రి వై యస్ జగన్ మోహన్ రెడ్డి గారికి అధికారం లోకి వచ్చాక కూడా పోలేదు అని అన్నారు. అందుకే ప్రజలు లాక్ డౌన్ కష్టాల్లో ఉన్నా కూడా గుట్టుగా కరెంట్ ఛార్జీలు పెంచి డబ్బు గుంజుతున్నారు అని ఆగ్రహం వ్యక్తం చేశారు.జగన్ గారూ, పాలన అనటే ప్రజలను కష్టాల నుండి గట్టెక్కించడానికి , అంతేకాని కష్టాల్లోకి నెట్టడం కాదు అని నారా లోకేష్ నిప్పులు చెరిగారు.

అయితే పార్టీ రంగుల వేయడానికి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం భారీగా ఖర్చు చేసిన సంగతి తెలిసిందే. అయితే మీరు అలా చేసిన వృధా ఖర్చు కన్నా, 3 నెలల విద్యుత్ బిల్లులు రద్దు చేస్తే వచ్చే నష్టం ఏమీ లేదు అని అన్నారు.కాబట్టి ప్రజలకు ఆ పని చేసి ఆదుకోండి అని వ్యాఖ్యానించారు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో కరెంట్ బిల్లులు ఎక్కువగా రావడం పట్ల ప్రజలు ఆందోళన చెందుతున్న విషయం తెలిసిందే. అయితే నారా లోకేష్ చేసిన వ్యాఖ్యల పై నెటిజన్లు స్పందిస్తున్నారు. జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం పై ఘాటు విమర్శలు చేస్తున్నారు.