ఇంత చేతకాని దద్దమ్మ, ముఖ్యమంత్రి ఏ రాష్ట్రానికి ఉండకూడదు – నారా లోకేష్

Friday, May 14th, 2021, 01:38:46 PM IST

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పై మరొకసారి నిప్పులు చెరిగారు తెలుగు దేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారూ మన రాష్ట్రం లో వైద్యం దొరికితే ప్రజలు తెలంగాణ కి ఎందుకు వెళతారు అంటూ సూటిగా ప్రశ్నించారు. ఇక్కడుంటే ప్రాణాలు నిలవవు, పక్క రాష్ట్రానికి వైద్యానికి కూడా వెళ్ళే అవకాశం లేదని సంచలన వ్యాఖ్యలు చేశారు. మీ మంత్రులు, ఎమ్మెల్యే లకు కోవిడ్ వస్టే ఆగమేఘాల పై హైదరాబాద్ పోయి,అక్కడి ఆసుపత్రుల్లో చేరతారు, అయితే ప్రజలు తమ ప్రాణాలను కాపాడుకొనేందుకు హైదరాబాద్ వెళ్ళే అవకాశం ఇప్పించలేరా అంటూ సూటిగా ప్రశ్నించారు. ఇంత చేతకాని దద్దమ్మ, ముఖ్యమంత్రి ఏ రాష్ట్రానికి ఉండకూడదు అంటూ ఘాటు విమర్శలు చేశారు.

అయితే తాడేపల్లి కొంపలో ఇంకెన్ని గంటలు నిద్రపోతారు కానీ, లేచి కేసీఆర్ గారికి ఫోన్ చేసి అనుమతులు తెప్పించండి అంటూ విమర్శించారు. అయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మానవతా దృక్పథంతో అత్యవసరంగా పరిగణించి కోవిడ్ పేషంట్ల అంబులెన్స్ లను అనుమతించాలి అని కోరారు. అంతేకాక ఆరోగ్య పరిస్తితి విషమించిన వారికి మెరుగైన వైద్యం కోసం మాత్రమే హైదరాబాద్ తరలిస్తారు అని వ్యాఖ్యానించారు. అయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దీనిని దృష్టిలో ఉంచుకొని కోవిడ్ పేషంట్ల అంబులెన్స్ లని ఆపకుండా స్పష్టమైన ఆదేశాలను ఇవ్వాలి అని అన్నారు. అయితే గోల్డెన్ అవర్స్ లోగా వారు ఆస్పత్రికి చేర గలిగితే కొన ఊపిరితో ఉన్న ప్రాణాలు నిలబడతాయి అని వ్యాఖ్యానించారు. నారా లోకేష్ చేసిన వ్యాఖ్యలకు ఇటు అధికార పార్టీ వైసీపీ నేతలు, తెలంగాణ రాష్ట్రానికి చెందిన నాయకులు ఎలా స్పందిస్తారో చూడాలి.