వైసీపీ ప్రభుత్వంపై మండిపడ్డ నారా లోకేష్

Saturday, August 24th, 2019, 01:04:59 AM IST

ఆంద్రప్రదేశ్ లో కొత్తగా వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటినుండి కూడా ఆంధ్రప్రదేశ్ లోని అధికార మరియు ప్రతిపక్ష పార్టీల మధ్యన తీవ్రమైన మాటల యుద్ధం జరుగుతున్న సంగతి విదితమే… అయితే ఎన్నికలకు ముందు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ప్రజలందరికి కూడా చాలా హామీలిచ్చారు. అయితే జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక సదరు హామీలన్నింటిని కూడా ఒక్కొక్కటిగా అమలు చేస్తూ వస్తున్నాడు. అంతేకాకుండా ఎన్నో కీలకమైన నిర్ణయాలను తీసుకుంటూ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్నాడు జగన్ మోహన్ రెడ్డి… కానీ ఎన్నికలకు ముందు జగన్మోహన్ రెడ్డి ఇచ్చినటువంటి హామీలన్నింటిని అసలే నెరవేర్చడం లేదని, ఒకవేళ వాటిని అమలు చేసే క్రమంలో ప్రజలందరినీ కూడా చాలా ఇబ్బందులకు గురిచేస్తున్నారని టీడీపీ జాతీయ కార్యదర్శి నారాలోకేష్ వైసీపీ ప్రభుత్వం పై మండిపడుతున్నాడు…

అయితే ఎన్నికలకు ముందు జగన్మోహన్ రెడ్డి అర్హులందరికీ సంక్షేమ పథకాలు అమలు చేస్తామని ప్రజాకందరికి కూడా హామీలిచ్చి, ఇపుడు అధికారంలోకి వచ్చాక సీఎం జగన్‌, ప్రజలందరినికూడా అనవసరమైన ఆంక్షల పేరుతో ఇబ్బందులకు గురిచేస్తున్నారని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ ఏపీసీఎం జగన్మోహన్ రెడ్డి పై తీవ్రమైన విమర్శలు చేశారు. సామాన్యులందరిని కూడా ఎందుకిలా కష్టపెడుతున్నారంటూ నారాలోకేష్ తన అధికారిక ట్విట్టర్ వేదిక ద్వారా ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ని ప్రశ్నిస్తున్నారు… దానికితోడు పథకాల అమలు పేరుతొ సగం మంది లబ్ది దారులని సంబంధిత జాబితాల నుండి తొలగించారని నారా లోకేష్ ఆరోపించారు. వైసీపీ ప్రభుత్వం పెడుతున్న ఆంక్షల కారణంగా రాష్ట్ర ప్రజలందరూ కూడా తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని నారాలోకేష్ ఆరోపిస్తున్నారు.