ప్రజలను వెర్రివాళ్ళని చేయలేరు – నారాలోకేష్

Friday, August 23rd, 2019, 12:42:24 AM IST

టీడీపీ ప్రధాన కార్యదర్శి నారాలోకేష్ మరొకసారి ట్విట్టర్ వేదిక ద్వారా తీవ్రమైన విమర్శలు చేశారు… పక్కాగా చెప్పాలంటే మాత్రం వైసీపీ నాయకులపై పరోక్షంగా తీవ్రమైన విమర్శలు సంధించారు. కాగా నిన్న కేంద్ర మాజీ మంత్రి చిదంబరం అరెస్టు అయిన సంగతి మనకు తెలిసిందే. కాగా చిదంబరాన్ని విడిపించడానికి రామోజీరావు, నళిని చిదంబరం, నారా భువనేశ్వరి విమానంలో ఢిల్లీకి వెళుతున్నారని సామాజిక మాధ్యమాల్లో ఓ పోస్టు వైరల్ అవుతోంది. అయితే ఆ పోస్టుకి సంబందించిన ఫొటోలో ఒకవైపు రామోజీరావు, మరొకవైపు భువనేశ్వరి ఉండగా వారి మధ్యలో మరొక మహిళా కుర్చొని ఉన్నారు… అయితే ఆ పోస్టు పెట్టిన సదరు వ్యక్తి ఆమెను నళిని చిదంబరం గా పేర్కొన్నారు… అయితే తాను నళిని చిదంబరం కానని, తనపేరు వనజ అని ఆ మహిళ స్వయంగా పేర్కొన్నారు…

దీంతో ఆ పోస్టుకి సంబందించిన ప్రచారానికి అడ్డుకట్ట పడిందని చెప్పాలి. అయితే ఈ పోస్టుకి సంబంధించి టీడీపీ జాతీయ కార్యదర్శి తనదైన శైలిలో చాలా ఘాటుగా స్పందించారు. దానికితోడు ఒక కామెంట్ కూడా చేశారు. “జఫ్ఫాగాళ్లు మరోసారి దొరికిపోయారని, ఈ పేటీఎం బ్యాచ్ సభ్యులు ప్రజల్ని వెర్రివాళ్లను చేయాలనుకుంటున్నారని, కొన్నిసార్లే కాదు అన్నిసార్లు అది సాధ్యం కాదన్న విషయం వారికి తెలియడంలేదని ఎద్దేవా చేశారు.