ఆ కంపెనీతో నాకు సంబంధమే లేదు – నారా లోకేష్

Wednesday, November 13th, 2019, 11:40:51 PM IST

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విశాఖపట్నంలోని బ్లూ ఫ్రాగ్ మొబైల్ టెక్నాలజీస్ సంస్థలో సిబిఐ అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తున్న సంగతిమనకు తెలిసిందెల్. కాగా బ్లూ ఫ్రాగ్ కంపెనీ వాళ్ళు ‘మన శాండ్’ అనే వెబ్ సైట్ ను హ్యాక్ చేసి ఇసుక సరఫరాను బ్లాక్ చేశారని ఇప్పటికే పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. కాగా ఈ విషయంలో మాజీ మంత్రి, టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ కి సంబంధాలు ఉన్నాయని చాలా వరకు పుకార్లు వస్తున్నాయి. అయితే ఈమేరకు స్పందించిన టీడీపీ నేత నారా లోకేష్ కొన్ని ఆసక్తికర వాఖ్యలు చేశారు.

గత కొద్దీ రోజులుగా నేరారోపణలు ఎదుర్కుంటున్నటువంటి ఈ సంస్థతో తనకు ఎటువంటి సంబంధం లేదని, అనవసరంగా తనపై కొందరు కావాలనే కుట్రపూరితంగా వ్యవహరిస్తూ తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని నారా లోకేష్ మండిపడుతున్నారు. అంతేకాకుండా వైసీపీ ప్రభుత్వ అసమర్థత పాలన నుండి ప్రజలను తప్పు దారి పట్టించడానికి ఇలా కొందరు నాటకాలు ఆడుతున్నారని నారాలోకేష్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.