బ్రేకింగ్: జగన్ కి దిమ్మతిరిగే షాక్ ఇచ్చిన లోకేష్

Thursday, October 17th, 2019, 12:35:46 PM IST

జగన్ ఎన్నికల సమయం లో చెప్పింది ఒకటి, చేస్తుంది మరొకటి అని టీడీపీ నేతలు ఇప్పటికే విమర్శలు గుప్పిస్తున్నారు. నిరుద్యోగ యువతకు కోటి 70 లక్షల ఉద్యోగాలిస్తానని పాదయాత్రలో అన్నారు. కానీ నిరుద్యోగ యువత పై కేసులు పెట్టడం సబబు కాదని లోకేష్ అన్నారు. ఉద్యోగాల కోసం అనంతపురం లో ధర్నా చేసిన 22 మంది నిరుద్యోగుల పై క్రిమినల్ కేసులు పెట్టడం పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసారు నారా లోకేష్. నిరుద్యోగులపైనా పెట్టిన అక్రమ కేసులను వెంటనే ఎత్తివేయాలని డిమాండ్ చేసారు.

గ్రామ సచివాలయ విషయం గురించి ప్రస్తావిస్తూ సీఎం జగన్ మోహన్ రెడ్డి పై సంచలన వ్యాఖ్యలు చేసారు. గ్రామా సచివాలయ ఉద్యోగాలన్నిటిని వైసీపీ కార్యకర్తలకే ప్రభుత్వం కట్టబెట్టింది అని అన్నారు. పేపర్ లీక్ స్కామ్ ద్వారా దాదాపు 20 లక్షల మంది నిరుద్యోగులను నట్టేట ముంచారు అని ఆరోపించారు. ఇప్పటికే పలు విషయాల్లో వివాదమైన జగన్ తీరు నారా లోకేష్ మరొకసారి స్పందించడం తో ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాల్లో హాట్ టాపిక్ అయిందని చెప్పవచ్చు. మరి జగన్ ఈ విషయం పై స్పందిస్తారో లేదో తెలియాలంటే వేచి చూడాల్సిందే.