బిగ్ న్యూస్: జయంతిని వర్థంతి అంటే వచ్చిన నష్టం ఏంటి? జగన్ ఫై నారా లోకేష్ సెటైర్లు!

Wednesday, December 11th, 2019, 10:01:57 AM IST

తెలుగుదేశం పార్టీ జనరల్ సెక్రెటరీ అయిన నారా లోకేష్ వైసీపీ నేతల ఫై సంచలన వ్యాఖ్యలు చేసారు. అసెంబ్లీలో లేకపోయినా తన పేరు గురించి ప్రస్తావించడం పట్ల వైసీపీ నేతల ఫై విమర్శలు చేసారు. సభలో లేని వ్యక్తి గురించి ప్రస్తావించడం సభ సంప్రదాయాలు వైసీపీ కి తెలియదా అని మండిపడ్డారు. చంద్రబాబు తరువాత వైసీపీ తననే ఎక్కువగా టార్గెట్ చేసిందని తెలిపారు.

అయితే వర్థంతిని జయంతి అనడం వల్ల ఆంధ్ర ప్రదేశ్ కి వచ్చిన నష్టం ఏమిటని లోకేష్ ప్రశ్నించారు. రాష్ట్ర పెట్టుబడులు వెనక్కి పోయాయా? పోలవరం ప్రాజెక్టు పనులు ఆగాయా? అమరావతి నిర్మాణ పనులకు ఏమైనా అంతరాయం కలిగిందా అని అన్నారు. అయితే చదువుల కోసం అమెరికా వెళ్లిన నారా లోకేష్ అక్కడే బీటెక్ పూర్తీ చేసాక వరల్డ్ బ్యాంకు లో జాబు చేసానని తెలిపారు. తెలుగులో తప్పు మాట్లాడటం వలన వచ్చిన నష్టం ఏమిటని ప్రశ్నించారు.

జగన్ ని టార్గెట్ చేస్తూ నారా లోకేష్ సంచలన వ్యాఖ్యలు చేసారు. 11 కేసులు వున్న జగన్ మోహన్ రెడ్డి 43 వేల కోట్ల ప్రజాధనాన్ని దోచుకున్నారన్న అభియోగాల్ని ఎదుర్కోడమే కాకా,16నెలలు జైలులో వున్న విషయం మరిచిపోయారా? అని అన్నారు. ఇపుడు కడిగిన ముత్యంలా నీతులు చెబితే వినడానికి ఎవరూ సిద్ధంగా లేరని ఎద్దేవా చేసారు.