జగన్ ప్రభుత్వాన్ని దారుణంగా ఆడుకుంటున్న లోకేష్..

Friday, September 20th, 2019, 03:30:21 PM IST

జగన్ చేస్తున్న పలు కార్యక్రమాలు, ఒప్పందాలు, రద్దులు, ఉద్యోగాల పేరిట చేసే మోసాల పై నారా లోకేష్ జగన్ ని ఒక ఆట ఆడుకుంటున్నారు. సీఎం జగన్ మోహన్ రెడ్డి బాక్సైట్ తవ్వకాలను రద్దు చేస్తున్నట్లు తెలపడం పట్ల పలు విమర్శలు చేసారు. 2014 లో చంద్రబాబు నాయుడు గారు వైయస్ హయం లోని అనుమతులన్నీ రద్దు చేశామని చెప్పారు. మళ్ళీ ఈ కొత్త నాటకం ఏంటి అన్నట్లు ఎద్దేవా చేసారు.

రద్దు చర్యల పై మాత్రమే కాకుండా పారదర్శకం గా ఉద్యోగ ప్రక్రియ నిర్వహిస్తామని చెప్పిన జగన్ మాటల పై కూడా కామెంట్ చేసారు. దాదాపు 18 లక్షల మంది నిద్రాహారాలు మాని పరీక్షలకి తయారయితే, మీ పెద్దలు ప్రశ్నా పత్రాన్ని లీక్ చేసి డబ్బు సొమ్ము చేసుకుంటున్నారు అన్నారు. పారదర్శకత అంటే ప్రశ్నా పత్రం లీక్ చేయడమా? అంటూ సీఎం జగన్ మోహన్ రెడ్డి పై ధ్వజమెత్తారు. అదేదో సినిమాలో మళ్ళి పెళ్లి అన్నట్లు రద్దు అంటారు. రద్దు చేసిన దానిని ఎలా రద్దు చేస్తారంటూ వ్యాఖ్యానివ్వడం, ఉద్యోగాల ప్రక్రియ పై ఇలా విమర్శలు రావడం జగన్ పాలనకు మచ్చ తెచ్చేలా వున్నాయి అంటున్నారు విశ్లేషకులు.