2019 సార్వత్రిక ఎన్నికలలో వైసీపీ భరోయ్ మెజారిటీతో గెలవడం టీడీపీ కి కోలుకోలేని దెబ్బ. ఒకటి కాదు రెండు కాదు, 151 సీట్లతో వైసీపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అయితే వైసీపీ తీసుకుంటున్న నిర్ణయాలు టీడీపీ కి అవకాశాలు గా మారుతున్నాయి. ముఖ్యమంత్రి అయ్యాక జగన్ నిర్ణయాలు ప్రతి పక్షాలకు అవకాశాలుగా మారడమే కాకుండా దేశంలోని పలువురు ప్రముఖుల చేత విమర్శల పాలవుతుంది. దీనితో టీడీపీ, జనసేన మరింత రెచ్చిపోతున్నాయి.
వైసీపీ పాలన ని ఎండగడుతూ నారాలోకేష్ ట్వీట్ చేసారు. ఇప్పటివరకు టీడీపీ కార్యకర్తలను హత్య చేయడం, ఇళ్ల నుండి బయటికి రాకుండా గోడలు కట్టడం, వేధించి ఆత్మహత్యలు చేసుకొనేలా చెయ్యడం చేసారు, ఇపుడు వైసీపీ రౌడీలు మరో అడుగు ముందుకేసి ప్రజల పై పడ్డారు అని తెలిపారు. గ్రామస్తులకు త్రాగునీరు ఇవ్వండి అని వేడుకోవడం,ఫలితం లేకపోయే సరికే వారే రిపేర్ చేసుకోవడానికి యత్నించడంతో వైసీపీ నాయకులూ కత్తులు, కొడవళ్ళతో దడి చేసారు. అదే విషయాన్నీ చాల వివరంగా చెప్పారు నారా లోకేష్.
వైకాపా రాక్షస పాలన పరాకాష్టకు చేరుకుంది. ఇప్పటివరకూ టిడిపి కార్యకర్తలను హత్య చెయ్యడం, ఇళ్ళ నుండి బయటకి రాకుండా గోడలు కట్టడం, వేధించి ఆత్మహత్యలు చేసుకునేలా చెయ్యడం చేసారు. ఇప్పుడు వైకాపా రౌడీలు మరో అడుగు ముందుకేసి ఏకంగా ప్రజలపై పడ్డారు. (1/3) pic.twitter.com/DKAmAoffmQ
— Lokesh Nara (@naralokesh) November 18, 2019