బిగ్ బ్రేకింగ్: జగన్ కి మైండ్ బ్లోయింగ్ షాక్ అంటే ఇదే!

Friday, November 22nd, 2019, 06:31:49 PM IST

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ ఫై విమర్శలు వస్తూనే వున్నాయి. అయితే తాజాగా నారా లోకేష్ వైయస్ జగన్ ఫై సంచలన వ్యాఖ్యలు చేసారు. ఇటీవల లూలూ గ్రూప్ కంపెనీ కూడా రాష్ట్రం వదిలి వెళ్లిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా వీర వాహన ఉద్యోగ్ లిమిటెడ్ గురించి నారా లోకేష్ ఇలా అన్నారు. జగన్ గారిని చూసి రాష్ట్రానికి రావాల్సిన కంపెనీలు బై బై ఆంధ్ర ప్రదేశ్ అంటున్నాయి అని సంచలన వ్యాఖ్యలు చేసారు. చేసేది ఏమీ లేక చంద్రబాబు నాయుడు గారి హయాంలో రాష్ట్రానికి వచ్చిన కంపెనీలు మేము తెచ్చాము అని జగన్ గారు బిల్డప్ ఇస్తున్నారని అన్నారు.

ఇంతటితో ఆగక జగన్ తీరు ఫై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ, స్మశానాలకు పార్టీ రంగులు వేసుకునే జగన్ గారికి ఇంతకంటే మంచి ఆలోచనలు వస్తాయి అనికోవడం అత్యాశే అంటూ ఎద్దేవా చేసారు. వీర వాహన సంస్థని రాష్ట్రానికి తీసుకురావడానికి చంద్రబాబుగారు పడిన కష్టం అందరికి తెలుసు అని అన్నారు. అయితే ఈ విషయంలో మరొక ముందడుగు వేసి సంచలన వ్యాఖ్యలు చేసారు నారా లోకేష్. రాయితీలు ఇచ్చి, భూ కేటాయింపులు చేసి తెచ్చిన కంపెనీకి జగన్ గారు వైసీపీ రంగు పూయాలని తెగ తాపత్రయపడుతున్నారు అని అన్నారు. వేరే వారికీ పుట్టిన బిడ్డకి మీరు తండ్రి అని చెప్పుకోవడం మాని, సొంతంగా ఏదైనా సాధించి డప్పు కొట్టుకోండి హైలీ రెస్పెక్టెడ్ జగన్ గారు అంటూ సంచలన వ్యాఖ్యలు చేసారు.