ముఖ్యమంత్రి జగన్ కి ఊహించని షాక్ ఇవ్వనున్న నారా లోకేష్?

Wednesday, December 11th, 2019, 12:04:44 PM IST

తెలుగు దేశం పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ రాజకీయాల్లో దూకుడుని ప్రదర్శిస్తున్నారు. వైసీపీ నేతలు చేస్తున్న విమర్శలు తిప్పికొడుతూనే, జగన్ సర్కార్ ఫై తీవ్ర ఒత్తిడిని తెచ్చే ప్రయత్నంలో వున్నారు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఆర్టీసీ చార్జీలు పెంచిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ విషయం లో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రభుత్వాన్ని ముప్పుతిప్పలు పెడుతున్నారు.

అయితే అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తూ మాజీ మంత్రి టీడీపీ నేత నారా లోకేష్ ఆర్టీసీ బస్సులో ప్రయాణించారు. మంగళగిరి నుండి ఆర్టీసీ బస్సులో టీడీపీ నేతలతో అసెంబ్లీ వరకు ప్రయాణం చేసారు. అయితే ఆర్టీసీ చార్జీలు పెంచడం పట్ల ప్రయాణికుల స్పందనని అడిగి తెలుసుకున్నారు. 15 కిలోమీటర్లకు రూపాయిన్నర పెరగాలని, కానీ ఆర్టీసీ ఉద్యోగులు అయిదు రూపాయలు అధికంగా వాసులు చేస్తున్నారని నారా లోకేష్ దృష్టికి తీసుకు వచ్చారు.

అయితే ఆర్టీసీ చార్జీల రేట్లు తక్షణమే తగ్గించాలంటూ టీడీపీ నిరసన కార్యక్రమాన్ని చేపట్టింది. నల్ల బ్యాడ్జిలు ధరించి అసెంబ్లీ ఫైర్ స్టేషన్ వద్ద నిరసన తెలిపారు. అక్కడి నుండి ర్యాలీ చేపట్టి అసెంబ్లీకి చేరుకున్నారు. అయితే ఇప్పటికే కష్టాల్లో వున్న ప్రజల ఫై ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఆర్టీసీ చార్జీల భారం వేశారని అన్నారు. పెంచిన ధరలు వెంటనే తగ్గించాలి అంటూ డిమాండ్ చేసారు. అయితే ఇప్పటికే దూకుడు గా వ్యవహరిస్తున్న నారా లోకేష్ మున్ముందు జగన్ ప్రభుత్వం ఫై ఎలా ఎటాక్ చేస్తారో అంటూ కొందరు చర్చించుకుంటున్నారు.