సీఎం జగన్ ని సూటిగా ప్రశ్నించిన నారా లోకేష్

Wednesday, August 14th, 2019, 12:11:18 PM IST

ప్రస్తుతం వై యస్ జగన్ ప్రభుత్వం కూల్చడాలే లక్ష్యంగా వ్యవహరిస్తుందని నారా లోకేష్ ట్విట్టర్ వేదిక ద్వారా జగన్ పై మండి పడ్డారు. నెల్లూరు జిల్లా వెంకటేశ్వర పురం లో తమ పార్టీ కి చెందిన నాయకుల ఇళ్లను అక్రమ కట్టడాల పేరుతో కూల్చివేయడం మరియు దీనికి పోలీసులు కూడా సంహరించడం చాలా దురదుష్టకరం అని తెలియజేసారు. కూల్చివేసిన కట్టడాల ఫోటోలను తన ట్విట్టర్ అకౌంట్లో పోస్ట్ చేశారు. ఆంధ్ర ప్రదేశ్ లోని వేదాయ పాలెం పోలీస్ స్టేషన్ ఎదుట దగ్గర టీడీపీ కార్యకర్తల ఆందోళన చేపట్టారు. ఆ చిత్రాలని కూడా నారా లోకేష్ తన ట్విట్టర్ అకౌంట్ లో పోస్ట్ చేసారు.

టీడీపీ నేతలపై జరుగుతున్న ఈ పరిణామాలను ఉద్దేశించి, కక్ష సాధింపులు మరియు కూల్చివేయడమే మీ అధికారం ఐతే, ఆ అధికారం శాశ్వతం కాదు అని నారా లోకేష్ వై యస్ జగన్ పై ధ్వజమెత్తారు. ఏది ఏమైనా ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్నా ఈ పరిణామాలు అక్కడి రాజకీయాలను వేడెక్కించే విధంగా ఉండటంతో దీనిపై జగన్ ఏ విధంగా స్పందిస్తారో చూడాలి. గడిచిన ఎన్నికలలో టీడీపీకి సహకరించిన నేతలపై ఇలా జరగడం వలన మున్ముందు ఇలాంటి పరిణామాలు మరికొన్ని వై యస్ జగన్ ప్రభుత్వం తమపై చేస్తుందని తెలుగు దేశం నాయకులూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.