పబ్లిసిటీ పీక్స్..విషయం వీక్..నారా లోకేష్ సెటైర్స్..!

Monday, July 13th, 2020, 12:28:51 PM IST

ఏపీలో అధికార పార్టీ వైసీపీ మరియు ప్రతిపక్ష పార్టీ తెలుగుదేశం ల నడుమ పొలిటికల్ వార్ తారా స్థాయిలో నడుస్తుంది. జగన్ ప్రభుత్వం కరోనా విషయం లో చేస్తున్న పనులకు గాను ఎలా అయితే ప్రశంసలు వస్తున్నాయో అంతే స్థాయిలో విమర్శలు కూడా వస్తున్నాయి.

అయితే టీడీపీ మంత్రి మరియు ఆ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు తనయుడు నారా లోకేష్ జగన్ పై మరియు ఆ పార్టీ పనులపై తనదైన శైలి విమర్శలు మరియు సెటైర్లు వేస్తుంటారు.

అలా ఇప్పుడు ఏపీలో కరోనా రోగులు ఆసుపత్రులలో ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొన్నారో వారికి రాష్ట్ర ప్రభుత్వం వారు ఎలాంటి సదుపాయాలను అందించారో చెప్తూ ముసలాయన చెప్పిన వీడియోను షేర్ చేసి సంచలనం రేపారు.

పైగా దీనికి “పబ్లిసిటీ పీక్స్…విషయం వీక్… దిస్ ఈజ్ వాస్తవం…” అంటూ ట్యాగ్ కూడా పెట్టారు. మరి లోకేష్ ఏ వీడియో షేర్ చేశారో ఈ కింద చూడండి.