జగన్ రెండేళ్ల పాల‌న‌లో ధ‌ర‌లు రెండింత‌లు పెరిగాయి – నారా లోకేశ్

Friday, June 11th, 2021, 04:51:44 PM IST


ఏపీ సీఎం జగన్‌పై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఇండియన్ పెట్రోల్ లీగ్ సౌత్ ఇండియా నెంబర్ వన్ జగన్ 101.61 నాటౌట్ అంటూ సెటైరికల్ ట్వీట్ చేశారు. విధ్వంసం-విద్వేషం రెండుక‌ళ్లుగా సాగుతున్న జగన్ రెండేళ్ల పాల‌న‌లో ధ‌ర‌లు రెండింత‌లు పెరిగాయి. ప్ర‌భుత్వ ట్యాక్స్‌ల‌కు అద‌నంగా జ‌గ‌న్ ట్యాక్స్ తోడ‌వ‌డంతో అన్ని రేట్లు పెరిగాయని అన్నారు.

బాదుడురెడ్డి దెబ్బ‌కి పెట్రోల్ ధ‌ర‌ శుక్ర‌వారం ద‌క్షిణాది రాష్ట్రాల‌లో సెంచ‌రీ దాటి (రూ.101.61) నాట‌వుట్‌గా రికార్డులు సృష్టించిందని అన్నారు. అంతేకాదు అభివృద్ధిలో అట్ట‌డుగు స్థానం, కోవిడ్ కేసుల్లో 5వ స్థానానికి ఏపీని చేర్చిన జ‌గ‌న్‌, పెట్రోల్ ధ‌ర‌ల పెంపులో సౌత్‌లో మ‌న రాష్ట్రాన్ని నెంబ‌ర్‌వ‌న్‌గా నిలిపారు. ఇది జ‌గ‌న్ రెడ్డి పాపం.. ప్ర‌జ‌ల‌కు శాపం అని లోకేశ్ అన్నారు.