చంద్రబాబు క్రెడిట్ మరోసారి కొట్టేసిన జగన్.!

Saturday, February 15th, 2020, 11:57:52 AM IST


మన ఏపీ రాజకీయ వర్గాల్లో పదవి వ్యామోహం మరియు నెంబర్ల పిచ్చితో పాటుగా క్రెడిట్ పిచ్చి కూడా బాగానే ఉంది అని చెప్పాలి.రాష్ట్ర ప్రభుత్వం అనే పదానికి అతీతంగా ప్రభుత్వం మారిన ప్రతీ సారి వీళ్ళ హయాంలో మొదలైన పనులు వాళ్ళు ఆపేసి తెలీని పనుల తాలూకా పనుల క్రెడిట్ లు కొట్టెయ్యడం గత ప్రభుత్వం వారు ప్రారంభించిన పనులను తాము పూర్తి చేస్తే వాళ్ళకి ఎక్కడ క్రెడిట్ వచేస్తుందో అని ఆ పనులను ఆపెయ్యడం జగన్ సర్కార్ తో మొదలయ్యింది.ఇప్పుడు ఇరు పార్టీల నడుమ అవే క్రెడిట్ రాజకీయాలు వస్తున్నాయి.

ఏపీలో చంద్రబాబు నిర్మించిన పలు నిర్మాణాలు మరియు ప్రాజెక్టులను ఎక్కడిక్కడ ఆపించేసి జగన్ బాబుకు ఎక్కడ క్రెడిట్ వస్తుందో అని తన తొందరపాటును చూపించుకున్నారు.కానీ పరిశ్రమల విషయంలో మాత్రం తన తండ్రి హయాంలో తీసుకొచ్చిన వాటిని కూడా జగన్ తన ఖాతాలో వేసేసుకుంటున్నారని నారా లోకేష్ అంటున్నారు.తాజాగా ఏపీ ప్రభుత్వంతో “టోరె” అనే మెగా టెక్నికల్ టెక్స్ టైల్ సంస్థ పనిచేసేందుకు ముందుకు రాగా ఆ క్రెడిట్ ను జగన్ తీసేసుకుంటున్నారని ఆ పరిశ్రమను కూడా “కియా” సంస్థను బెదిరించినట్టుగా చేసి రాష్ట్ర అభివృద్ధికి ఆటంకం కలిగించొద్దని లోకేష్ జగన్ పై తన ట్విట్టర్ ఖాతా ద్వారా పదునైన సెటైరికల్ ట్వీట్లు విసిరారు.