మేడే సందర్భంగా ఖబడ్ధార్ చెప్పండి.. నారా లోకేశ్ పిలుపు..!

Saturday, May 1st, 2021, 01:24:09 PM IST

Nara_Lokesh

మేడే సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికి టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ట్విట్టర్ వేదికగా శుభాకాంక్షలు తెలియచేశాడు. నిరంకుశ పెత్తనం, అణచివేత, శ్రమ దోపిడీ ఎక్కువ కాలం సాగవని ప్రపంచానికి తెలియచెప్పిన రోజు మేడే అని త్యాగాలతో, పోరాటాలతో ప్రజలు సాధించుకున్న విశాఖ ఉక్కు వంటి పరిశ్రమలను కాజేయాలని చూసే రాష్ట్ర పెద్దలకు ఈ మేడే సందర్భంగా ఖబడ్ధార్ చెప్పండని పిలుపునిచ్చారు.

కరోనా మూలంగా ఆర్థిక కష్టాల్లో ఉన్న కార్మిక సోదరులను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని, ప్రాజెక్టుల నిర్మాణాలు చేపట్టి కార్మికులకు ఉపాధి కల్పించాలని, పరిశ్రమలను తెచ్చి ఉద్యోగాలు ఇవ్వాలని లోకేశ్ డిమాండ్ చేశారు. అలాంటి రోజే శ్రామిక, కార్మిక సోదరులకు నిజమైన మేడే అని నారా లోకేశ్ వ్యాఖ్యానించాడు.