జగన్‌ను చూస్తుంటే బాధగా ఉంది.. నారా లోకేశ్ సెటైర్లు..!

Monday, August 12th, 2019, 08:17:30 PM IST

ఏపీలో ఈ సారి జరిగిన సార్వత్రిక ఎన్నికలలో వైసీపీ భారీ విజయాన్ని నమోదు చేసుకుని ఏపీ ముఖ్యమంత్రిగా వైసీపీ అధినేత జగన్ పదవి బాధ్యతలు కూడా చేపట్టారు. అయితే అధికార పార్టీ టీడీపీ మాత్రం గెలుపే లక్ష్యంగా పెట్టుకుని పని చేసినా ఈ ఎన్నికలలో మునుపెన్నడు లేని రీతిలో ఓటమి పాలైంది. అయినా కూడా వైసీపీ, టీడీపీ మద్గ్య రోజూ మాటల యుద్ధం పెరిగిపోతూ ఉంది.

అయితే గత కొద్ది రోజుల నుంచి టీడీపీ యువనేత నారాలోకేశ్ వైసీపీ, జగన్‌లపై తన ట్విట్టర్ ద్వారా సంచలన ఆరోపణలు చేస్తున్నాడు. అయితే తాజాగా మరో సారి వైసీపీ అధినేత సీఎం జగన్‌పై దిమ్మతిరిగే సెటైర్లు విసిరారు. మద్యం మానవసంబంధాలని మంటగలుపుతుందని జగన్ గారు అన్నమాటను వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి నిజం చేశారంటూ, మందుకొట్టి ఒక విలేఖరి ఇంటికి వెళ్ళి అతనిపై చేయిచేసుకుని చంపుతా అని అమానుషంగా బెదిరించడమే కాకుండా, పొలీసులు, జగన్ కూడా నన్నేమీ చేయలేడు అంటూ వైసీపీ అధినేత పరువును కూడా తీసేసారు. ఏది ఏమైనా జగన్ గారు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి. ఇదే ఎమ్మెల్యే, చంద్రబాబుగారిని అసెంబ్లీలో ఖబడ్దార్ అని అన్నప్పుడు ముసిముసి నవ్వులు నవ్విన జగన్ గారు ఇప్పుడా నవ్వు ముఖాన్ని ఎక్కడ దాచుకోవాలో తెలీక అవస్థలు పడుతుంటే మాకూ బాధగానే ఉంది. కానీ ఏం చేస్తాం వైసీపీ సంస్కృతి అలాంటిది మరీ అంటూ సెటైర్లు విసిరారు.