ఆ పార్టీ పేరు ఊసరవెల్లి అని మార్చాల్సింది – నారాలోకేష్ సెటైర్లు

Friday, November 15th, 2019, 12:40:38 AM IST

తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపైన కొన్ని సంచలన వాఖ్యలు చేశారు. కాగా గురువారం నాడు రాష్ట్ర టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశానికి హాజరైనటువంటి నారా లోకేష్ మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వంపైన తీవ్రమైన విమర్శలు చేశారు. ఒకవైపు రాష్ట్రంలో ఇసుక కొరత వలన చాలా మంది భవన నిర్మాణ కార్మికులు ఆత్మహత్య చేసుకొని మరణిస్తుంటే, అవేమి పట్టించుకోకుండా రాష్ట్రంలోని పంచాయితీ భవనాలకు పార్టీ పరమైన రంగులు వేసుకుంటూ సంబరాలు చేసుకుంటున్నారని నారా లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

అంతేకాకుండా రాష్ట్రంలో ప్రభుత్వ భవనాలకు రంగులు వేయడమే పనిగా పెట్టుకున్న ఈ నేతల పార్టీ పేరు ని మార్చుకొని ఊసరవెల్లి అని పెట్టుకోవాల్సిందిగా నారా లోకేష్ సూచించారు. ఇకపోతే సీఎం జగన్ తీసుకున్న నిర్ణయం వలన రాష్ట్రంలో ఇసుక కొరత జరుగుతుందని వాస్తవంగా ఒప్పుకోకుండా, వరదెలా కారణంగా ఇసుక రవాణా జరగడం లేదని చెప్పడం చాలా దారుణమని వాపోయారు. కానీ ఇతర రాష్ట్రాల్లో కూడా వరదల తీవ్రత బాగానే ఉన్నప్పటికీ కూడా ఎక్కడా ఇసుక కొరత జరగనిది, కేవలం మన రాష్ట్రానికే ఎందుకు జరుగుతుందని నారా లోకేష్ వైసీపీ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు.