జగన్ ఆ ప్రకటన చేసే వరకు ఉద్యమం ఆగదు —నారా లోకేష్

Tuesday, January 14th, 2020, 12:30:25 AM IST

అమరావతి రాజధాని విషయంలో రైతుల చేస్తున్న ఆందోళన ఫై పోలీసులు ప్రవర్తించిన తీరు ఫై నారా లోకేష్ సంచలన వ్యాఖ్యలు చేసారు. అరెస్ట్ చేసిన 22 మంది రైతులని గుంటూరు జైల్లో నారా లోకేష్ పరామర్శించారు. రైతులకు న్యాయపరంగా సహకారం అందిస్తామని వారికీ భరోసా ఇచ్చారు నారాలోకేష్. అమరావతి రాజధాని ఉద్యమాన్ని అణచివేసేందుకు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ప్రయత్నిస్తున్నారని సంచలన ఆరోపణలు చేసారు.

ముఖ్యమంత్రి జగన్ మూడు రాజధానులు వొద్దు, అమరావతే ముద్దు అని ప్రకటన చేసే వరకు ఈ ఉద్యమం ఆగదు అని నారా లోకేష్ వ్యాఖ్యానించారు. అధికార పార్టీ ఎమ్మెల్యే అసభ్యకరంగా మాట్లాడితే ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని, చట్టాన్ని చుట్టంలా మార్చుకుంటున్నారని సంచలన వ్యాఖ్యలు చేసారు. తమ కార్యాలయాల వద్ద పోలీసులని ఉంచడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేయడమే కాకా, ముఖ్యమంత్రి జగన్ వద్ద పోలీసులు ఉండాలని, జగన్ బెయిల్ ఫై బయట తిరుగుతున్నారని వ్యాఖ్యానించారు. మహిళల పట్ల తీవ్రంగా దాడి చేయిస్తున్నారని, వారు ఒక్కసారిగా ఎదురుతిరిగితే ప్రభుత్వం క్షణం కూడా అధికారంలో ఉండదని సంచలన వ్యాఖ్యలు చేసారు.