సీఎం జగన్ పై మండిపడుతున్న నారా లోకేష్ – కారణం అదేనేమో…?

Friday, February 14th, 2020, 02:01:41 PM IST

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పై, ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ తీవ్రమైన విమర్శలు చేశారు. అయితే ఈ విమర్శలన్నీ కూడా నారా లోకేష్ తన అధికారిక ట్విట్టర్ వేదిక ద్వారా చేశారు. అయితే అధికార పార్టీ నాయకులు కావాలనే కుట్ర పూరితంగా వ్యవహరిస్తూ, టీడీపీ నేతలపై అనవసరమైన ఐటీ దాడులు జరిపిస్తున్నారని ఆరోపిస్తూ, తప్పుడు కథనాలు సృష్టిస్తున్నారని ఆరోపించారు. అంతేకాకుండా టీడీపీ నేతల ఇంట్లో అధిక మొత్తంలో అవినీతి డబ్బు దొరికిందని అసత్య ప్రచారాలు చేస్తూ, కొందరు వైసీపీ నేతలు సంబురాలు చేసుకుంటున్నారని నారా లోకేష్ మండిపడుతున్నారు.

ఈ మేరకు నారా లోకేష్ ”పచ్చకామెర్ల వాడికి లోకమంతా పచ్చగా కనిపించినట్లు.. జగన్‌కి అవినీతి కనపడటంలో పెద్ద ఆశ్చర్యం ఏమీ లేదు. ఐటీ దాడుల్లో కొండను తవ్వి ఎలుకను పట్టినట్లు.. వాళ్లు ఇచ్చిన పత్రికా ప్రకటన ద్వారానే అర్థమైంది. 40 చోట్ల సోదాల్లో రూ.85 లక్షలు దొరికాయని అధికారులు చెప్పారు. చంద్రబాబు మాజీ పీఎస్ ఇంట్లో.. రూ.2 వేల కోట్లు దొరికాయి అని తప్పుడు ప్రచారం చేస్తూ.. వైసీపీ నేతలు శునకానందం పొందుతున్నారు. రావాలి జగన్.. కావాలి జగన్ అని జైలు పిలుస్తుంది. అందుకే ఇన్‌ఫ్రా కంపెనీల్లో ఐటీ దాడులతో టీడీపీకి ముడిపెట్టాలని తెగ తాపత్రాయపడుతున్నారు” అని వాఖ్యానించారు.