అప్పుడేమో ఆరాటం, ఇప్పుడేమో పోరాటం – నారాలోకేష్ సంచలన వాఖ్యలు

Wednesday, November 20th, 2019, 12:40:42 AM IST

టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ మరొకసారి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పై కొన్ని సంచలనమైన వాఖ్యలు చేశారు. అయితే ఏపీలో గత కొద్దీ రోజులుగా ఇంగ్లీష్ మీడియం అనే అంశంపై అటు అధికార పార్టీకి మరియు ఇటు ప్రతిపక్ష పార్టీలకు కూడా ఒకరకమైన పోరాటం జరుగుతుంది. అయితే ఈ ఇంగ్లీష్ మీడియం అంశం మీద నారాలోకేష్ స్పందిస్తూ, సీఎం జగన్ పై విరుచుకపడ్డారు. కాగా విపక్షంలో ఉన్నప్పుడు తెలుగు కోసం ఆరాటపడి, ఏపీలో అధికారంలోకి రాగానే ఇంగ్లీష్ మీడియం కోసం పోరాటం చేస్తున్నారట వైసీపీ నేతలు అంటూ ఎద్దేవా చేశారు నారా లోకేష్.

కాగా అధికార పార్టీ వైసీపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు… సాక్షి టీవీలో ఓ బాలిక తమకు ఇంగ్లీష్ మీడియం అసలే వద్దని చెప్పిందని, కానీ ఇప్పుడు అదే బాలిక ఇంగ్లీష్ మీడియం చదువే కావాలనే చెబుతుండటాన్ని మళ్ళీ అదే సాక్షి ఛానల్ లో దర్శనం ఇవ్వడం అనేది దారుణంగా ఉందని నారా లోకేష్ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అంతేకాకుండా అధికారంలో ఉన్న వైసీపీ నేతలు ఏదైనా చేయొచ్చు అనే గర్వం తో ఉన్నారని, రాను రాను ఏదో ఒకరోజు దేశానికి స్వాతంత్ర్యం తీసుకువచ్చింది కూడా మహానేత అనే చెప్పిన ఆశ్చర్యపోవాల్సిన అవసర లేదని నారా లోకేష్ ఎద్దేవా చేశారు.