నారా లోకేష్ సంచలన నిర్ణయం – కరోనా నివారణకు సీఎం సహాయ నిధికి విరాళం

Tuesday, March 24th, 2020, 11:40:16 PM IST

ప్రపంచవ్యాప్తంగా భయంకరమైన మహమ్మారి కరోనా వైరస్ బీభత్సంగా వ్యాపిస్తున్న తరుణంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అన్నీ కూడా ఎన్నో కఠినమైన చర్యలను చేపట్టాయి. అంతేకాకుండా జనతా కర్ఫ్యూ ని పొడగించి, ఏప్రిల్ 15 వరకు కూడా ఇదే కర్ఫ్యూ ని పాటించాలని కఠినమైన నిర్ణయాన్ని తీసుకున్నారు ప్రధాని మోడీ. ఈ నేపథ్యంలో దేశ ప్రజలందరినీ కూడా బయటకు వెళ్లకుండా కొన్ని కఠినమైన చర్యలను తీసుకుంటున్నారు. అయితే ప్రధాని మోడీ, సీఎం కేసీఆర్ తీసుకున్న నిర్ణయాలకు ప్రముఖులు, ప్రజలందరూ కూడా తమ మద్దతుని ప్రకటిస్తున్నారు. కాగా ఈ నేపథ్యంలో తెలుగు దేశం పార్టీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ ఒక సంచలనమైన నిర్ణయాన్ని తీసుకున్నారు.

ఈ భయంకరమైన కరోనా వైరస్ ని నివారించడానికి సీఎం సహాయనిధికి విరాళం ఇవ్వాలని నిర్ణయించుకున్నామని టీడీపీ నేత నారా లోకేష్ వాఖ్యానించారు. ఈ మేరకు పార్టీ అధినేత చంద్రబాబునాయుడు టీడీపీ పార్టీకి సంబందించిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో ఒక వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ మేరకు మాట్లాడిన నారా లోకేష్… ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు ప్రజలంతా సహకరించాలని, పనులు లేక ఇబ్బంది పడుతున్న పేద కుటుంబాలకు ప్రభుత్వం రూ.5 వేలు ఆర్థిక సహాయం ఇవ్వాలని కోరుతున్నామని నారా లోకేష్ వాఖ్యానించారు.