ఒక్క ఛాన్స్ అని అడిగి “గన్నేరు పప్పు” అనిపించుకున్నారు.!

Saturday, May 30th, 2020, 12:57:28 PM IST


ఏపీలో రాజకీయాలు మరోసారి వేడెక్కుతున్నాయి. అక్కడ ఉన్న మూడు పార్టీల నడుమ ఒకరిపై ఒకరు తీవ్ర షయిలో విమర్శలు చేసుకుంటున్నారు. అయితే వీరిలో టీడీపీ మరియు వైసీపీ పార్టీల నడుమ విమర్శలు అయితే తారా స్థాయిలో ఉంటున్నాయి. అలా ఇప్పుడు ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ పై నారా లోకేష్ ఇప్పుడు ఒక సంచలన ట్వీట్ పెట్టారు.

కేవలం ఈ ఒక్క ఏడాదిలోనే 87 వేల కోట్లు అప్పులు చేసేశారని పైగా రాష్ట్ర ఆస్తులను అమ్మకానికి పెట్టేశారని అలాగే ఒక్క ఛాన్స్ అని అడిగి రాష్ట్రాన్ని నాశనం చేసేసి గన్నేరు పప్పు అనే పేరును సార్ధకం చేసుకున్నారని సంచలన ట్వీట్ పెట్టారు. మరి దీనిపై వైసీపీ నుంచి ఎలాంటి రిప్లై వస్తుందో చూడాలి.