జగన్ సీఎం పదవికి రాజీనామా చెయ్యాలి..లోకేష్ సంచలనం!

Sunday, September 22nd, 2019, 05:53:41 PM IST

గ్రామ సచివాలయ ఉద్యోగ నియామకాల్లో భారీ అవకతవకలు జరిగాయని సచివాలయ ఉద్యోగాలకు ప్రిపేర్ చేసిన ప్రశ్నల పత్రాలు ముందుగానే వైసీపీ లీక్ చేసిందన్న వార్త ఇప్పుడు ఏపీ రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా నిలిచింది.ఇప్పుడు దీని పైనే ప్రధాన పార్టీలు సూటిగా జగన్ పైనే ప్రశ్నలు సంధిస్తున్నారు.అయితే గతంలో టీడీపీ అధికారంలో ఉన్నపుడు ఇలాంటి పరిస్థితి నెలకొన్న సందర్భంలో జగన్ చెప్పిన మాటలనే టీడీపీ మంత్రి నారా లోకేష్ ఒకసారి మళ్ళీ గురః చేస్తూ జగన్ను రాజీనామా చెయ్యాలని అడుగుతున్నారు.

“అయ్యా వై ఎస్ జగన్ గారూ, జరగని పేపర్ లీకేజి మీద నానా రభసచేశారు అప్పట్లో గుర్తుందా? జరిగిన విచారణలో కూడా అదే తేలింది అప్పట్లో. కానీ మీరేం అన్నారో, మీ అబద్ధపు పత్రిక ఎలా విషం చిమ్మిందో ఒకసారి మళ్ళీచూసుకోండి. అప్పట్లో రాజీనామా చెయ్యాలి, సిబిఐ విచారణ చెయ్యాలి అన్నారు. ఇప్పుడు ఏమి చేద్దాం?,గ్రామ సచివాలయ పరీక్షల ప్రశ్నాపత్రాలను మీ మంత్రులే లీక్ చేశారు. మీ అనుచరుల కుటుంబసభ్యులకు ర్యాంకులు వచ్చాయి అన్నది వాస్తవం. 5 లక్షలకు ఒక్కో ఉద్యోగం అమ్ముకోవడం వాస్తవం.పేపర్ లీక్ స్కామ్ బయటకి రాకుండా మీరు రహస్య మంతనాలు జరుపుతున్నారు.మరి మీరు రాజీనామా చేస్తున్నారా లేదా? మేము కొత్తగా ఏమి అడగడం లేదు, అప్పట్లో మీరు అడిగిన డిమాండ్స్ మాత్రమే అడుగుతున్నాం.” అంటూ జగన్ చెప్పిన మాటల్నే మళ్ళీ గుర్తు చేస్తూ సంచలనం రేపారు.