కేసుల మాఫీ కోసం మోదీ కాళ్ళపై పడుతున్నారు.. సీఎం జగన్‌పై నారా లోకేశ్ ఫైర్..!

Saturday, April 10th, 2021, 03:01:08 AM IST


ఏపీ సీఎం జగన్‌పై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ మరోసారి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. తిరుపతి పార్లమెంట్ ఉపఎన్నిక నేపథ్యంలో నేడు నెల్లూరు జిల్లాలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన నారా లోకేశ్ తాను జగన్‌కు సవాల్ విసిరి 48 గంటలు అయిందని అయిన స్పందన లేదని అన్నారు. వివేకా హత్యతో తనకు, తనకు కుటుంబ సభ్యులకు సంబంధం లేదని వెంకన్నసాక్షిగా తాను ప్రమాణం చేస్తానని లోకేష్‌ సవాల్ విసిరారు.

అయితే వివేకా హత్యతో తనకు సంబంధం లేదని అనుకుంటే జగన్‌రెడ్డికి ధైర్యం ఉంటే వెంకన్నసాక్షిగా ప్రమాణం చేయాలని లోకేశ్ అన్నారు. ఇదిలా ఉంటే పార్లమెంట్‌లో వైకాపా కౌరవులు రాష్ట్ర ప్రయోజనాలు తాకట్టు పెట్టి జగన్ రెడ్డి కేసుల మాఫీ కోసం మోదీ గారి కాళ్ళ పై పడుతున్నారని అన్నారు. అందుకే టీడీపీ పాండవులకు తోడుగా మన ఇంటి మాలక్ష్మి పనబాక లక్ష్మి గారిని గెలిపించాలి అని ప్రజల్ని కోరాను.