ప్రభుత్వం ఇకనైనా వారిని ఆదుకోవాలి – నారా లోకేశ్

Friday, August 7th, 2020, 12:33:54 PM IST

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి నారా లోకేశ్ జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా నేతన్నలందరికి శుభాకాంక్షలు తెలియచేశాడు. ఈ సందర్భంగా కరోనా కారణంగా దాదాపు మూడున్నర లక్షల మంది చేనేత కార్మికులు, 81వేల పవర్ లూమ్ కార్మికులు ఇబ్బందులు పడుతున్నారని, అమ్మాల్సిన సరకు చేనేతల వద్దే ఆగిపోయిందని ట్విట్టర్ ద్వారా తెలియచేశాడు.

అంతేకాదు నేతన్నల దగ్గరున్న స్టాక్‌ను వెంటనే కొనుగోలు చేయాలని, ప్రతి కుటుంబానికి 15వేల రూపాయల ప్రత్యేక కరోనా ఆర్థిక సాయం చేయాలని ప్రభుత్వాన్ని కోరానని కానీ ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేదని కేవలం 80 వేలమందికి సాయం అందించి ప్రచారం చేసుకుంటే సరిపోతుందా అని మిగిలిన వారి పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. లాక్ డౌన్ సమయంలో మంగళగిరి చేనేత కుటుంబాల కష్టాలు స్వయంగా తెలుసుకున్నానని, ఇక్కడి మంగళగిరి చీర ‘భారత చేనేత బ్రాండ్‌’గా ఎంపికైంది. అలాంటి నేతన్న కష్టాలలో ఉడతా సాయంగా బియ్యం, కూరగాయలు పంపిణీ చేయించాను. ప్రభుత్వం ఇకనైనా ముందుకొచ్చి నేతన్నలను ఆదుకోవాలని కోరారు.