జగన్ పత్రికలో కనపడిన పండుగ రైతుల కళ్ళలో కనపడటం లేదు – నారా లోకేశ్

Saturday, January 9th, 2021, 11:16:38 AM IST

ఏపీ సీఎం జగన్‌పై నారా లోకేశ్ మరోసారి ట్విట్టర్ వేదికగా మండిపడ్డారు. జగన్ గారి పత్రికలో కనపడిన పండుగ రైతుల కళ్ళలో కనపడటం లేదని అన్నారు. రైతులు పండించిన ప్రతి గింజకి గిట్టుబాటు ధర ఇచ్చి కొనుగోలు చేస్తామని మాట ఇచ్చారని, కానీ ఇచ్చిన మాట గాలి మాటగానే మిగిలిపోయిందని లోకేశ్ ఎద్దేవా చేశారు.

అంతేకాదు అర్థంపర్థం లేని నిబంధనలు, అరకొర కొనుగోళ్లు వెరసి రైతులకు శాపంగాను, దళారులకు వరంగాను మారాయని అన్నారు. పోనీ కొన్న ధాన్యానికి సొమ్ము చెల్లించారా అంటే అదీ లేదని, రీతులకు రూ.2574 కోట్లు బకాయి పెట్టారని మండిపడ్డారు. పండించిన పంటకి మద్దతు ధర రాదు, ప్రభుత్వం కొన్న ధాన్యానికి చెల్లింపులు చెయ్యరు. ఇలాంటి పరిస్థితుల్లో రైతులు పండగ ఎలా చేసుకోవాలి జగన్ రెడ్డి అని లోకేశ్ ప్రశ్నించారు.