వారి ఆరోగ్యం క్షీణిస్తే ప్ర‌భుత్వానిదే బాధ్య‌త‌.. జగన్ సర్కార్‌పై నారా లోకేశ్ సీరియస్..!

Tuesday, May 4th, 2021, 05:12:41 PM IST

Nara_Lokesh

ఏపీ సీఎం జగన్‌పై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ మరోసారి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ప్ర‌జ‌ల ప్రాణాలు క‌రోనాకి వ‌దిలి, ప్ర‌తిప‌క్షంపై క‌క్ష సాధిస్తున్న దేశంలోనే ఏకైక ముఖ్య‌మంత్రి మూర్ఖ‌పు రెడ్డి అని పేషెంట్ల‌కు ఆక్సిజ‌న్ అందించ‌డం మానేసి తెలుగుదేశంపై ఆధిప‌త్యం సాధించేందుకు తాడేప‌ల్లి కొంప‌లో వ్యూహ‌ర‌చ‌న చేస్తున్నారని అన్నారు.

అయితే రాజ‌ధానిపై మీ కుట్ర‌ల్ని బ‌ట్ట‌బ‌య‌లు చేశార‌నే క‌క్ష‌తో సంగం డెయిరీ చైర్మ‌న్‌ ధూళిపాళ్ల న‌రేంద్ర‌గారిని అక్ర‌మంగా అరెస్ట్ చేయించారు. డెయిరీ ఎండీ గోపాల‌కృష్ణ‌న్ ఆల్రెడీ కోవిడ్ పాజిటివ్‌గా తేలితే, న‌రేంద్ర‌గారు కోవిడ్ ల‌క్ష‌ణాల‌తో బాధ‌ప‌డుతున్నారని అన్నారు. వీరిద్ద‌రినీ ఆస్ప‌త్రికి త‌ర‌లించ‌కుండా ఏంటీ శాడిజం మూర్ఖ‌పు జగన్ త‌క్ష‌ణ‌మే న‌రేంద్ర గారు, గోపాల‌కృష్ణ‌న్ గార్ల‌కు మెరుగైన వైద్యం అందించాలని లోకేశ్ డిమాండ్ చేశారు. వారి ఆరోగ్యం క్షీణిస్తే ప్ర‌భుత్వానిదే బాధ్య‌త‌ అని హెచ్చరించారు.