ఓ ఫ్యాక్ష‌నిస్టు చీఫ్ మినిస్ట‌ర్ అయితే ఇలాంటే ఉంటుంది – నారా లోకేశ్

Wednesday, June 9th, 2021, 03:02:02 AM IST

Nara-Lokesh

ఏపీ సీఎం జగన్‌పై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ తీవ్ర స్థాయిలో మండిపడ్దారు. కర్నూలు జిల్లా పెద్దకడుబూరు మండలం బసలదొడ్డిలో టీడీపీ సానుభూతిపరులకు తాగునీరు నిలిపివేయ‌డాన్ని తీవ్రంగా ఖండిస్తున్నానని, అవినీతిపై ప్ర‌శ్నిస్తూ, అక్ర‌మాల‌పై నిల‌దీస్తోన్న ప్ర‌తిప‌క్షంపై త‌ప్పుడు కేసులు బ‌నాయిస్తోన్న ముఖ్య‌మంత్రి ప్ర‌జ‌ల‌పైనా క‌క్ష‌సాధింపు చ‌ర్య‌ల‌కు దిగ‌డం చాలా దారుణమని అన్నారు.

అంతేకాదు ఒక ఫ్యాక్ష‌నిస్టు చీఫ్ మినిస్ట‌ర్ అయితే ఎంత ఘోరంగా ఉంటుందో జ‌గ‌న్‌రెడ్డి పాలనే నిదర్శనమని, ప్ర‌జాస్వామ్యాన్ని ఖూనీ చేసిన జ‌గ‌న్‌రెడ్డి క‌నుస‌న్న‌ల్లోనే ఇటువంటి అరాచ‌కాలు సాగుతున్నాయని అన్నారు. అయితే వేస‌వికాలంలో ప‌ల్లెల్లో తాగునీరు అంద‌కుండా చేసి, వైసీపీ నాయ‌కులు వికృతానందం పొందుతున్నారు. వెంట‌నే బ‌స‌ల‌దొడ్డిలో టీడీపీ సానుభూతిప‌రుల‌కు తాగునీరు అందించాలని లోకేశ్ డిమాండ్ చేశారు.